SP Firing Training
SP Firing Training

Police Training: ప్రతీ ఆయుధంపై అవగాహన కలిగి ఉండాలి

ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం
ఆయుధ పరిజ్ఞానంపై ట్రైనీ కానిస్టేబుళ్లకు అవగాహన

Police Training: తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో గల ఫైరింగ్ రేంజ్ నందు ట్రైనీ కానిస్టేబుళ్లకు ఆయుధాలపై పూర్తి పరిజ్ఞానం అందించాలని ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం సూచించారు. స్వయంగా ఫైరింగ్ చేసి చూపించారు. ఫైరింగ్ ట్రైనింగ్ క్యాంపునకు హాజరైన ఎస్పీ ఫైరింగ్ లో మెలకువలు నేర్పించారు. ఫైరింగ్ విధానంపై అవగాహన కల్పించారు.

Adilabad SP Firing Training
Adilabad SP Firing Training

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. విధులు నిర్వర్తించే సమయంలో అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకున్నప్పుడు వ్యవహరించాల్సిన తీరును వివరించారు. అల్లరి మూకలపై టియర్ గ్యాస్, స్టన్ గ్రానైట్, వజ్రా వాహనం నందు గ్యాస్ గ్రానైట్ ప్రయోగం లాంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఫైరింగ్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధివిధానాలను సిబ్బందికి తెలియజేశారు. ఫైరింగ్ పొజిషన్స్, శత్రువుల పై దాడి చేసే విధానాన్ని వివరించారు. ఈ ట్రైనీ కానిస్టేబుళ్లకు శిక్షణ కాలంలో పూర్తి అవగాహన కల్పించినప్పుడే ఎలాంటి సందేహాలు లేకుండా నిర్భయంగా విధులను నిర్వర్తించగలరని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆపరేషన్ బీ సురేందర్ రావు, డీఎస్పీలు ఎల్ జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్, పోలీస్ శిక్షణ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

శెనార్తి మీడియా, తలమడుగు :

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *