Hero Playing Villaian Role
Hero Playing Villaian Role

Hero Playing Villaian Role: మెగాస్టార్ కు విలన్ గా టాలీవుడ్ హీరో

Hero Playing Villaian Role : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. బింబిసారతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు వశిష్ట మెగాస్టార్ తో విశ్వంభర సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

తాజాగా మెగాస్టార్ చిరు మరో కొత్త ప్రాజెక్ట్‌కు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈసారి సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరంజీవి ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలతో షూటింగ్ ను ప్రారంభించారు. చిరు, అనిల్ మార్క్ కామెడీతో పాటు మెగా మాస్ ఇమేజ్ కు తగ్గట్లుగా యాక్షన్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వబోతున్నారని సమాచారం.

ఇదిలా ఉండగా, ఈ సినిమాలో మెగాస్టార్‌కు ధీటైన విలన్ పాత్ర కోసం టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయను ఎంపిక చేసినట్లు సినీ పరిశ్రమలో చర్చ జరుగుతున్నది. కార్తికేయ ఈ సినిమాలో చిరంజీవికి సవాల్ విసిరే పాత్రలో కనిపించనున్నట్లు టాక్. విశేషమేమిటంటే, ఈ విలన్ పాత్ర కూడా కామెడీ టచ్‌తో ఉండనుందని తెలుస్తున్నది. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

కార్తికేయకు చిరంజీవి అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆయన వివాహ వేడుకలో చిరు హాజరైన విషయాన్ని అభిమానులు మర్చిపోలేరు. ఆర్ఎక్స్ 100తో హీరోగా సక్సెస్ కొట్టిన కార్తికేయ, ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ లో నానికి విలన్‌గా, తమిళ చిత్రం తెగింపులో అజిత్‌కు ప్రత్యర్థిగా మెప్పించారు. ఇప్పుడు చిరు సినిమాలోనూ విలన్ పాత్రలో కార్తికేయ దుమ్ము రేపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *