బరువు తగ్గినా ముఖం కాంతి కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలి?
Kareena Tips: సినీనటి కరీనా కపూర్ ఫిట్‌నెస్‌కి మారుపేరు. ఆమె డైటీషియన్ రుజుతా దివేకర్ చెబుతోన్న చిట్కాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
తాజా వీడియోలో రుజుతా మాట్లాడుతూ, ‘‘ఒక్కసారిగా బరువు తగ్గితే ముఖం నీరసంగా మారుతుంది. కానీ సరైన పద్ధతిలో వెయిట్ లాస్ చేస్తే, చర్మం మెరుస్తూ ఉంటుంది’’ అని తెలిపింది.
ఒక్కో అడుగూ స్థిరంగా వేయాలి
‘‘20 రోజుల్లో 10 కిలోలు తగ్గండి’’ అన్న యాడ్లు చూసి మోసపోవద్దని రుజుతా చెబుతోంది. సంవత్సర కాలంలో శరీర బరువులో 5-10 శాతం తగ్గితేనే అది ఆరోగ్యకరం. ఇది శరీరానికి సరిపోయేలా ఉంటుంది. అంతేగాక ముఖం వాడిపోకుండా, సహజంగా మెరుస్తూ ఉంటుంది.
సహజంగా వ్యాయామం
రోజూ జిమ్‌కి వెళ్లాల్సిన పనిలేదు. ఒక నెలలో కనీసం ఏడు రోజుల నుంచి 20 రోజుల పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే చాలని చెప్పింది. ఇది శరీరాన్ని చురుగ్గా ఉంచుతుందని, ముఖం వదులుగా మారకుండా కండరాలు ముద్దపడి ఉండేలా చేస్తుందని పేర్కొంది.
ఆహారం అనేది ఆరుబయట కాదు – ఇంట్లో తయారైనది కావాలి
ఆహార విషయంలో మితమే మంత్రం. ప్యాకెజ్‌డ్ ఫుడ్స్, రెడీ టు ఈట్ ఆహారానికి దూరంగా ఉండాలని సూచించింది. ఇంట్లో వండిన తాజా ఆహారమే శరీరానికి మేలు చేస్తుందని, కార్బోహైడ్రేట్లు, చక్కెరను పూర్తిగా తాకొద్దని తెలిపింది. సమతుల్య ఆహారం వల్లే చర్మంలో కాంతి ఉట్టిపడుతుందని తెలిపింది.
ఫలితం కోసం ఓపిక ఉండాలి
బరువు తగ్గడమంటే పరుగెడుతూ చేసే ప్రక్రియ కాదు. ఓపికతో, ఆరోగ్యంగా జీవించే మార్గమే. చర్మంపై ప్రకాశం ఉండాలంటే సరైన దినచర్య, ఆహారం చాలా ముఖ్యం. కరీనా లాంటి ప్రకాశవంతమైన అందం సాధ్యం కానీ పని కాదని రుజుతా స్పష్టం చేసింది.