Ntr Rejcets Top Hero: భారతీయ సినీ ప్రియుల గుండెల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన తాజా సినిమా కూలీ సినిమా త్వరలో విడుదల కానున్నది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 కూడా రిలీజ్ కు సిద్ధమవుతున్నది. అటు రజినీ, ఇటు ఎన్టీఆర్ సినిమాలు ఆగస్టు 15న థియేటర్లలో ఢీకొనబోతున్నాయి. కానీ తారక్‌కు పోటీ వద్దని రజనీకాంత్ నిర్మాతలకు సూచించారని టాక్. కానీ ఈ రెండు సినిమాలు అదేరోజు విడుదల కావడం ఖాయమని సినీ పరిశ్రమ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్నది. రిలీజ్ డేట్ మారకుంటే బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ ఏర్పడనుంది.
సూపర్ స్టార్ ను కాదని..
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కాల్సింది. మిర్చి, శ్రీమంతుడు వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన జనతా గ్యారేజ్ సినిమా కోసం దర్శకుడు శివ ముందుగా రజనీకాంత్ ను తీసుకోవాలని భావించారు. సినిమాలో మోహన్ లాల్ చేసిన పాత్ర రజనీకాంత్‌కు పక్కాగా సెట్ అవుతుందని అనుకున్నారు. అయితే తారక్ మాత్రం సున్నితంగా వద్దని చెప్పారట డైరెక్టర్‌కు. రజనీ సార్ ఇమేజ్ వేరు అని, ఆ పాత్ర ఆయన చేయడం తగదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట.
మోహన్ లాల్ పాత్రకు రజనీ స్థానంలో
తారక్ నిర్ణయం కారణంగా, కొరటాల శివ మోహన్ లాల్ కు జనతా గ్యారేజ్ కథ చెప్పారు. తన పాత్ర నచ్చడంతో మోహన్ లాల్ వెంటనే సినిమాను అంగీకరించారు. సినిమా సజావుగా అనుకున్న టైమ్ లో పూర్తయ్యింది. జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే రజనీకాంత్- తారక్ కాంబినేషన్ లో సినిమా మిస్ కావడం మాత్రం అభిమానులను కాస్త నిరాశకు గురి చేసింది.
భవిష్యత్తులో ఆశ లేదు?
ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రావడానికి సరైన కథ సిద్ధం చేయగల దర్శకుడు పరిశ్రమలో లేరని అభిమానులు అంటున్నారు. ఒకవేళ వీరి కలయికలో సినిమా వచ్చినా అది సినీ చరిత్రలో కొత్త రికార్డులను సృష్టిస్తుందంటున్నారు.
బాక్సాఫీస్ పోరాటానికి సిద్ధం
ఇక కూలీ, వార్ 2 ఒకేరోజు విడుదలై, ఇద్దరు సూపర్ స్టార్ల మధ్య ఆసక్తికర పోటీ తెరపై నడవనుంది. ప్రేక్షకుల స్పందన ఎలా ఉండబోతుందో చూడాల్సిందే!