రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర
పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాం
Thalamadugu : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తామన్న రూ. 2 లక్షల రుణమాఫీ నగదు రైతుల ఖాతాలో జమ కాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో గ్రామంలో డప్పులతో శవయాత్ర నిర్వహించారు.. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తామన్న రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తిస్థాయిలో రైతుల ఖాతాల్లో జమ చేయాలని, లేని పక్షంలో తెలంగాణ ఉద్యమం మాదిరిగానే రైతు ఉద్యమం చేస్తామని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ గందరగోళంగా ఉందన్నారు.. అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ రాకపోతే కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తిరుగనివ్వమన్నారు.. ప్రభుత్వం రైతులను మోసం చేసిందని.. ఖరీఫ్ సీజన్లో రైతు బంధు పథకo ఇవ్వలేదని.. రైతు వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు.. సీఎం దిష్టిబొమ్మను రైతులు తగలబెట్టే క్రమంలో రైతులకు పోలీసుల మధ్య కొంత తోపులాట జరిగింది.. తలమడుగు తో పాటు పలు గ్రామాల్లో రైతుల నిరసన చేపట్టారు.
-శెనార్తి మీడియా, తలమడుగు