Thiranga yatra

Thiranga Yatra: ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర

కేశవపట్నంలో బీజేపీ తిరంగా యాత్ర ర్యాలీ
కేశవపట్నంలో బీజేపీ తిరంగా యాత్ర ర్యాలీ

Thiranga Yatra: మండలంలో హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కేశవపట్నంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాయకులను గుర్తు చేసుకుంటూ నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరు తమ ఇంటిపై బాధ్యతగా జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి, అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య, ప్రధాన కార్యదర్శులు దాసారపు నరేందర్, కొయ్యడ అశోక్, ఉపాధ్యక్షులు సుధధగోని శ్రీనివాస్, పెసరు అర్జున్, జానపట్ల రాజిరెడ్డి, వివిధ మోర్చాల అధ్యక్షులు కన్కం సాగర్, బిజిలి సారయ్య, జగ్గారెడ్డి, వెంకటలక్ష్మి, నాయకులు, పల్లె శివారెడ్డి, చుక్కల శ్రీకాంత్, రాసమల్ల శ్రీనివాస్, చర్ల శ్రీనివాస్, పార్టీ కార్యకర్తలు, ఆల్ఫ్రెడ్ నోబెల్ హై స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.

శెనార్తి మీడియా,శంకరపట్నం :

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *