మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ఆర్వోఆర్ చట్టం ముసాయిదాపై చర్చ
ROR Act: రాష్ట్రంలో నెలకొన్న భూ సమస్యల పరి ష్కారానికి నూతన రెవెన్యూ (ఆర్వోఆర్) చట్టాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ కుమార్ దీ పక్ అన్నారు. నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదాపై కలెక్టర్ ఆధ్వర్యంలో విశ్రాం త రెవెన్యూ అధికారులు, విద్యావేత్తలు, న్యాయ వాదులు, నిపుణలు, రైతు సంఘాల నాయకులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం చర్చా కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ తోపాటు జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు రాములు, హరికృష్ణ, భూ సేక రణ ప్రత్యేకాధికారి చంద్రకళ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిపుణులు, మే ధావులు, విశ్రాంత రెవెన్యూ అధికారులు అందించి న సూచనలు, సలహాలను ప్రభుత్వానికి నివేదిస్తా మని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న భూ రికార్డులు, నిర్వహణ పద్ధతులు పరిశీలించిన నిపుణుల బృందం నూతన ఆర్ ఓఆర్ చట్టం ముసాయిదాను రూపొందించిందని పేర్కొ న్నారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లా డుతూ భూ సేకరణ, వ్యవసాయ, వ్యవసాయేతర భూములను గుర్తించి మండల రెవెన్యూ కార్యాల య స్థాయి, రెవెన్యూ డివిజనల్ స్థాయిలో పరిష్కరించి వాటిని త్వరగా పూర్తి చేయాలని సూచించా రు. ఆంధ్రప్రదేశ్ పాస్ పుస్తకాలు ఉన్న స్థానంలో తెలంగాణ పాస్ పుస్తకాలు ఇవ్వాలని, ధరణి పోర్ట ల్ను భూదేవి, భూమాతగా మార్చాలని, నోషనల్ పట్టా సమస్యలు పరిష్కరించాలని, వారసత్వ భూ ముల బదలాయింపు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. గ్రామాల్లో ఆబాద్ భూముల రికార్డులను ఆధునీకరించడం, సాదాబైనామా భూముల సమ స్యలు పరిష్కరించాలని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో అప్పిలేట్ అథారిటీ ఆర్డీఓకు ఉండాలని, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజ నుల హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చట్టాన్ని రూపొందించాలని పేర్కొన్నారు. ఈ సమా వేశంలో విశ్రాంత తహసీల్దార్లు, రెవెన్యూ అధికారు లు, న్యాయవాదులు, రైతు సంఘాల నాయకులు, రైతులు, నిపుణులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల: