Implicite Parijath

Implicite: నూతన ఉత్పాదన ఇంప్లిసిట్ విడుదల

Implicite: భారతీయ బహుళ జాతీయ సంస్థ పారిజాత్(Parijath) ఇండస్ట్రీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా ఆధునాతన సాంకేతిక పరిశోధనతో రూపొందించిన ఇంప్లిసిట్ కీటకనాశిని పురుగుల మందును ఆదిలాబాద్ లో సంస్థ సౌత్ డీజీఎం యు. శ్రీనివాసులు రెడ్డి ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల క్రిమిసంహారక మందులతోపాటు మొక్కలకు పోషకాలు అందించే ఉత్పత్తుల పోర్ట్ఫోలియో పారిజాత్ అని పేర్కొన్నారు. ఇంప్లిసిట్, పత్తి, సోయా, మిరప, కూరగాయల పంటల్లో వచ్చు రబ్బరు పురుగు, లద్దె పురుగు, తామర పురుగు, నల్లి జాతుల నివారణకు ఇంప్లిసిట్ను విడుదల చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రీజినల్ హెడ్ ఆర్. రాజేందర్, మార్కెటింగ్ మేనేజర్ వి.ప్రసన్న కుమార్, ఆదిలాబాద్ టెర్రిటరీ మేనేజర్ ఎస్.చంద్రకాంత్ రెడ్డి, నిజామాబాద్ టెర్రిటరీ మేనేజర్ ప్రవీణ్ కుమార్, డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, ఆదిలాబాద్

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *