Keshavapatnam thahasil office

Snake in Office : పాములు పట్టేవారితో అధికారుల బేరసారాలు

బేరం కుదరలేదు.. పామును పట్టలేదు

Snake in Office : కేశవపట్నంలోని తహసీల్దార్ కార్యాలయంలో నాగుపాము కలకలం రేపింది. మంగళవారం నాగు పాము నేరుగా స్టోర్ రూమ్ లోకి వెళ్లింది. కార్యాలయ సిబ్బంది పాములు పట్టే అతడికి సమాచారం ఇచ్చాడు. తీరా అతడు వచ్చిన తర్వాత అధికారులు బేరసారాలు ఆడారు. బేరం కుదరకపోవడంతో పామును పట్టకుండానే అతడు వెను తిరిగాడని సమాచారం. గవర్నమెంట్ అధికారులు ఇలా బేరసారాలకు దిగడంపై ఇటు సందర్శకుల, అటు కార్యాలయ సిబ్బంది ప్రాణాలతో చెలగాటం ఆడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఆపద సమయాల్లో బేరసారాలకు దిగిన ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దని కోరుతున్నారు.

శెనార్తి మీడియా,శంకరపట్నం

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *