accident

Accident: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరికి గాయాలు

Accident : శంకరపట్నం మండలం వంకాయ గూడెం గ్రామానికి చెందిన చల్ల కనకయ్య (60) శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో  తీవ్ర గాయాలయ్యాయి. కనకయ్య తలకు బలమైన గాయం కావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. పెట్రోలింగ్ పోలీసులు 108 ఫోన్ చేయడంతో వెంటనే  స్పందించిన ఈఎంటీ సతీష్ రెడ్డి, పైలెట్ గోపికృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుని ప్రథమ చికిత్స చేశారు. అనంతరం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

శెనార్తి మీడియా, శంకరపట్నం

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *