మంచిర్యాలలో వరల్డ్ హార్ట్ డే ర్యాలీ
World Heart Day : ఒత్తిడిలేని జీవితం, మితాహారం, శారీరక వ్యాయామంతోనే గుండె జబ్బులు దూరమవుతాయని ప్రముఖ వైద్యులు స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రి వసుధ వైద్య బృందం ఆధ్వర్యంలో సిబ్బంది ర్యాలీ నిర్వహించి ప్రజలకు గుండె సంబంధిత వ్యాధులు నివారణ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వసుధ వైద్యులు మాట్లాడుతూ… గుండె పదిలంగా ఉంటేనే మనుగడ సాధ్యమని అన్నారు. ప్రతీ ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపినప్పుడే ఎటువంటి గుండె జబ్బులు దరిచేరవని పేర్కొన్నారు. క్రమానుగత జీవన శైలిని అటవాటు చేసుకోవాలని సూచించారు. ఒత్తిడిని దూరం చేసుకోవాలని, ఆహారంలో మార్పులు చేసుకోవాలన్నారు. నిత్యం తేలికపాటి ఎక్సర్ సైజ్‌లు, యోగా చేయాలని సూచించారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తితే వైద్య చికిత్సతో మెరుగుపర్చుకోవచ్చుని, అదే గుండెను పదిలంగా కాపాడుకోకపోతే ప్రాణాలకే ముప్పు తప్పదన్నారు. ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. మద్యం, ధూమపానం లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో స్వచ్చందంగా పాల్గొన్న వారిని మిగతా వారు స్ఫూర్తిగా తీసుకొని తమ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వసుధ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల