Nadipeeli press meet
Nadipeeli press meet

Divakar Rao : పీఎస్సార్.. నీ అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మరు

మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు
హైదరాబాద్ లో పేకాట క్లబ్బులు నడిపేది ఎవరో అందరికీ తెలుసు : బీఆర్ఎస్‌వై నాయకుడు విజిత్ రావు

Divakar Rao : మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. ఎమ్మెల్యే పీఎస్సార్ చేసిన ఆరోపణలను దివాకర్ రావు ఖండించారు. మంచిర్యాలలోని తన నివాసంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు ఎవరు ఎలాంటి వారో తెలుసని చెప్పారు. ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం కేవలం ఎమ్మెల్యే పీఎస్సార్ కే సాధ్యమని విమర్శించారు. తనపై, తన కుమారుడిపై తప్పుడు ప్రచారం చేసి, తప్పుడు కేసులు పెట్టాలనే ఉద్దేశంతో పీఎస్సార్ ఆరోపణలు చేశారన్నారు. మంచిర్యాలలో అభివృద్ధి పేరుతో మార్కెట్ ఏరియాలో కూల్చివేతలు కేవలం కొందరి వ్యాపారుల కోసం పీఎస్సార్ చేస్తున్న కుట్ర అని ఆరోపించారు.

ఎనిమిది నెలల్లో మంచిర్యాలను మాఫియా మంచిర్యాలగా చేసిన ఘనత పీఎస్సార్ కే దక్కిందని ఘాటుగా విమర్శించారు. మంచిర్యాలలో గంజాయి చెలామణి అవుతుందని, తాము పూర్తిగా వ్యతిరేకమనే విషయం జగమెరిగిన సత్యమని తెలిపారు. తమపై ఆరోపణలు చేసే ముందు పీఎస్సార్ ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ లోని కాప్రాలో తమ ప్లాట్లు కబ్జా చేశాడని వందలాది మంది ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రికి మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్సార్ పై ఫిర్యాదులు చేశారని గుర్తు చేశారు. ధర్నాలు, నిరాహార దీక్షలు చేశారన్న విషయం పీఎస్సార్ కు గుర్తు చేశారు. 2014లో కాగజ్ నగర్ లో పోటీ చేసినప్పుడు ఈ కాప్రా భూ బాధితులు వ్యతిరేకంగా ప్రచారం చేశారనే విషయం మరిచిపోయావా అని ప్రశ్నించారు.

మంచిర్యాల నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాల పేరుతో కూలగొట్టడం కాకుండా వారు ఉంటున్న భూమికి స్థానికంగా ఉండే రేటు ప్రకారం ప్రభుత్వానికి డబ్బు కట్టిచ్చి వాటిని రెగ్యులరైజ్ చేయడానికి పోరాడాలి తప్ప కూలగొట్టడానికి కాదు అని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రిటైర్డ్ సింగరేణి ఉద్యోగస్తులకి 242 గజాల భూమి ఇస్తానని హామీ ఇచ్చారని, వారికి భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. అంతేకానీ కట్టుకున్న ఇళ్లను కూలగొడితే తాము కచ్చితంగా వ్యతిరేకిస్తానని చెప్పారు. తన సిద్ధాంతం గూడు కట్టుకుంటూ వెళ్లడమే తప్ప, ఇండ్లు కూలగొట్టుకుంటూ పోవడం కాదన్నారు.

మంచిర్యాల లో చేసిన ప్రతి అభివృద్ధి వెనక దివాకర్ రావు ఉన్నాడనే విషయాన్ని గుర్తంచుకోవాలన్నారు. 119 నియోజకవర్గాలలో మంచినీరు ఎవరు ఇవ్వడం లేదని, కేవలం నేను మాత్రమే ఇచ్చానని పీఎస్సార్ చెప్పుకుంటున్నాడని, ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. మంచిర్యాలలో నీరు ఇవ్వడానికి కారణం ఆనాడు తాను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

Divakar Rao press Meet
Divakar Rao press Meet

బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు నడిపెల్లి విజిత్ రావు మాట్లాడుతూ… 324 సర్వే నెంబర్ లో గజం స్థలం కూడా మాకు లేదన్నారు. ఎమ్మెల్యే గా ఉన్న పీఎస్సార్ మాటల్లో వాస్తవం ఉంటే 57 ఎకరాల భూమి తీసి ప్రభుత్వానికి అప్పజెప్పాలని సవాల్ విసరిరారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేయమని, బీజేపీకి ఓటు వేస్తామని కాంగ్రెస్ కౌన్సిలర్లు చెప్పారన్నారు. బీజేపీకి ఎవరు తొత్తులా వ్యవహరిస్తున్నారో చెప్పాలన్నారు. బీజేపీకి ఓటు వేసిన కాంగ్రెస్ కౌన్సిలర్లను బహిష్కరిస్తావా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిచిన ఎంపీని కూడా మంచిర్యాల నియోజకవర్గానికి రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారో అందరికీ తెలుసున్నారు.

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో ఉందని, ఈ నియోజకవర్గంలో లక్షెట్టిపేట, నస్పూర్ లో ఉంటుంది కానీ మంచిర్యాలలో ఉండొద్దా అని ప్రశ్నించారు. 119 నియోజకవర్గాల్లో కేవలం మంచిర్యాలలో మాత్రమే నీళ్లు ఇచ్చి ఉంటే పక్కన ఉన్న చెన్నూర్, బెల్లంపల్లి, ఖానాపూర్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీళ్లు ఇయ్యని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా అని విజిత్ ప్రశ్నించారు. చెన్నూర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నీళ్లు ఇస్తున్నారో లేదో చెప్పాలన్నారు.

హైదరాబాద్ లో పేకాట క్లబ్బులు ఎవరు నడిపారో అందరికీ తెలుసని చెప్పారు. ప్రేమ్ సాగర్ రావు కుట్రలో భాగంగానే మంచిర్యాలలో గంజాయి విక్రయిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టే ఆలోచనలో ఉన్నారని ఆరోపించారు. 324 సర్వే నెంబర్ లో 57 ఎకరాల భూమి తీసి ఫెన్సింగ్ వేయాలని, ప్రభుత్వానికి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో మంచిర్యాల బీఆరెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *