శ్రీపాద ఎల్లంపల్లి 30 గేట్లు ఓపెన్.. కడెం 18 గేట్లు ఎత్తివేత
గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
Yellampalli Project: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వస్తున్న వరదతో కడెం ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం నిల్వ 695.00 అడుగులు ఉంది. ఇన్ ఫ్లో 2.30లక్షల క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 2.78 లక్షల క్యూసెక్కుల వరద వదులుతున్నారు. కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ మరో సారి డేంజర్ జోన్ లోకి వెళ్లినట్లు తెలుస్తున్నది. వరద ఇలాగే కొనసాగితే గేట్లు మరింత ఎత్తి ప్రవాహాన్ని పెంచే యోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని గుడిపేట శివారులోని శ్రీపాద ఎల్లంపల్లి (Sripada Yellampalli Project)ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. సోమవారం తెల్లవారు జామున ప్రాజెక్టు క్రస్ట్ లెవల్ 148 మీటర్లకు గాను 147.51కి చేరింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.175 కాగా 18.8139 టీఎంసీలకు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా కుర్తున్న భారీ వర్షాలు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో 5,08,275 క్యూ సెక్కుల వరద ప్రాజెక్టులో చేరుతున్నదని అధికారులు తెలిపారు. ఔటఫ్లో 6,10,00 క్యూసెక్కులు గా ఉందని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 20 గేట్లు ఎత్తిన అధికారులు, సోమవారం తెల్లవారు జామున మరో పది గేట్లు ఓపెన్ చేశారు. మొత్తం 30 గేట్ల ద్వారా 6,10,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. వరద ఇలాగే కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు పోలీస్ అధికారులు గోదావరి పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా అధికారులు
మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తం గా ఉండి తాగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగం సూచిస్తుంది. అవసరమైతే తప్ప ప్రజలవ్వరు బయటకు రావద్దని, విషజ్వెరాలు వ్యాప్తి ఎక్కువగా ఈ సమయంలో త్వరిత్వరిగా వ్యాపిస్తాయని బయటకు వస్తే జాగ్రత్తలు చేసుకొని తప్ప రవ్వదాని సూచించారు. మరోవై ముంపు ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అధికారులు, పోలీసులు, నాయకులు అప్రమతం చేస్తున్నారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల: