Murder in luxettepeta

Illegal Affair: బోళ్ల వ్యాపారి హత్య?

Illegal Affair: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ లోని గురునానక్ ఫంక్షన్ హాల్ సమీపంలో మంగళవారం రాత్రి సుమారు 9.30 గంటల ప్రాంతంలో హజీపూర్ మండలం సబ్బేపల్లి గ్రామానికి చెందిన బోళ్ల వ్యాపారి చింతల దేవయ్య (37) దారుణ హత్యకు గురయ్యాడు. దేవయ్య భార్య రాజేశ్వరి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దేవయ్య వ్యాపారం నిమిత్తం రోజు లక్షెట్టిపేటకు వెళ్తాడని, మంగళవారం కూడా వెళ్లాడని పేర్కొంది. రాత్రి అయినా ఇంటికి రాలేదని. కాసేపటికి తన భర్త చనిపోయినట్లు ఫోన్ వచ్చిందని విలపించింది. తన భర్తకు గత కొంత కాలంగా హాజీపూర్ మండలం దొనబండకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందని, అది ఆమె భర్తకు తెలియడంతో వారించాడని పేర్కొంది. అయినా కూడా మారకపోవడంతో వివాహిత భర్త ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొంది. దీంతో వారి బంధువులతో పాటు మరికొంత మంది తన భర్తపై కక్ష పెట్టుకొని పథకం ప్రకారం హత్య చేశారని, బలమైన ఆయుధంతో తల పై కొట్టి చంపారని దేవయ్య భార్య రాజేశ్వరి వాపోయింది. రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు లక్షెటిపేట ఎస్ఐ సతీష్ తెలిపారు. మృతదేహాన్ని సీఐ నరేందర్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ పరిశీలించారు.

శెనార్తి మీడియా, మంచిర్యాల :

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *