Buildings In Buffer Zone : బఫర్ జోన్లో బహుళ అంతస్తులు

రాముని చెరువు చుట్టూ గోడలు
కరువైన అధికారుల పర్యవేక్షణ

Buildings In Buffer Zone : ఇక్కడ ప్రభుత్వ నిబంధనలు పట్టవు. రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలను ఎక్కడికక్కడ తొలగించుకుంటూ వస్తుంటే మంచిర్యాలలో మాత్రం అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.  కానీ ఇవేమీ మంచిర్యాల మున్సిపల్ అధికారులకు కనిపించడం లేదు.  ప్రజల ప్రాణాలను లెక్క చేయకుండా కొందరు రియల్టర్లు, బిల్డర్లు డబ్బులు సంపాద నే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారనడానికి మంచిర్యా లలోని రాముని చెరువు బపర్ జోన్లలో నిర్మాణాలే నిదర్శనం. ప్రభుత్వ పెద్దలను మేనేజ్ చేస్తూ చెరువులను సైతం మింగేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని రాముని చెరువు పరిసర ప్రాంతం హాట్ కేక్ లాంటిది. గతంలో ఈ చెరువు చుట్టూ పచ్చనిచెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేంది. ప్రస్తుతం చెరువు బఫర్ జోన్, ఎన్టీఎల్, శిఖం భూముల్లో అక్రమార్కులు విచ్చల విడిగా నిర్మాణాలు చేపడుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతోనే అనే అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. సర్వే నంబర్ 406లో 47.32 ఎకరాల్లో రాముని చెరువు ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉన్నది. దీని స్టోరేజి 15 మిలియన్ క్యూబిక్ ఫీట్ (ఎంసీఎఫ్ టీ)లు కాగా అదీ తగ్గిపోయింది. చెరువు ఎస్టీఎల్ హద్దులను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు. కానీ పదేళ్ల క్రితం నాటి విస్తీర్ణానికి, ఇప్పటి చెరువు విస్తీర్ణంలో వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తున్నది. చెరువు చు ట్టూ బఫర్ జోన్లో గోడలు కట్టుకొని అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో యథేచ్ఛగా ఆక్రమణలు కొనసాగుతున్నాయి. చెరువు బఫర్ జోన్లో కొందరు బిల్డర్లు దర్జాగా బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు చేపడుతున్నారు. జీ+5, అంతకుమించి నిర్మాణాలు చేస్తున్నారు. కొందరైతే ఒక సర్వే నంబర్లో భవన నిర్మాణాలకు అనుమతి తీసుకొని మరో చోట నిర్మాణాలు సాగిస్తున్నారు. చెరువు ఎన్టీఎల్, బఫర్ జోన్, శిఖం భూమి పట్టా ఉన్న సర్వే నంబర్లు కాకుండా ఇతర సర్వే నంబర్ మీద అనుమతి తీసుకొని చెరువు బఫర్ జోన్లోనే నిర్మాణాలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

మామూళ్లు ఇస్తే చాలు
జిల్లాలో చెరువు, కుంట, వాగు, శిఖం భూములలో అనుమతులకు ఎక్కడ ఇవ్వడానికి అయినా అధికారులు సిద్ధమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. రాముని చెరువుకు అనుకోని ఉన్న బహుళ అంతస్తే ఇందుకు నిదర్శనం.

 ఇదీ మున్సిపాలిటీ అధికారుల తీరు…
పేరుకే పెట్టింది ‘మంచి’ ర్యాల అంటూ పలువురు చర్చించుకోవడం గమనార్హం. కానీ మంచి చుట్టు చేరింది అంతా ముంచే కాలమే అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలు జిల్లాల్లో హైడ్రా తాండవం చేస్తూ ఉంటే మంచిర్యాలలో మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నది. చెరువులు, వాగులు, నాలాలు, శిఖం భూములలో వెలసిన వెంచర్లు, ఇండ్ల నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి. ఇదీ మంచిర్యాల జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ అధికారుల పనితీరుకు నిదర్శనమని స్థానికులు చర్చించుకుంటున్నారు.

చెరువు హద్దు రాయిని అనుకోని వెలసిన బహుళ అంతస్తూ ప్రహరీ
చెరువు హద్దు రాయిని అనుకోని వెలసిన బహుళ అంతస్తూ ప్రహరీ

హద్దులు మాయం చేసేందుకునా?
రాముని చెరువు హద్దు రాళ్లను మాయం చేసేందుకు అక్కడ ప్రహరీ నిర్మాణం చేపట్టారని స్థానికులు చర్చించుకుంటున్నారు. హద్దుకు ఎంత దూరంలో భవన నిర్మాణం చేపట్టాలి అనే నిబంధనలు తుంగలో తొక్కి ఏకంగా జీ +5 బిల్డింగ్ నిర్మించినా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. దీంతో మున్సిపల్ అధికారుల వైఖరిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదంతా ఇలా ఉంటే అధికారులకు తెలియకుండా ఇంత పెద్ద భవనం నిర్మించారా అని పట్టణంలో ఎక్కడా చూసినా దీనిపైనే చర్చించుకోవడం కనిపిస్తున్నది.

-శెనార్తి మీడియా, మంచిర్యాల 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *