Kalki Collections: సౌత్ సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD విడుదలై 10 రోజులు అయ్యింది. ఈ పది రోజుల్లో రోజుకో రికార్డను బద్దలు కొడుతూ వస్తున్నది. బాలీవుడ్ హేమాహేమీలకు సాధ్యం కానీ రికార్డులను ప్రభాస్ నెలకొల్పుతూ వస్తున్నాడు. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కల్కి2989 ఏడీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమా 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమా సగటున 80-90 కోట్ల వసూళ్లు సాధిస్తున్నది. ప్రస్తుతం ఈ సినిమా వీకెండ్ చివరి రోజు కూడా మంచి వసూళ్లు రాబట్టే దిశగా సాగుతోంది. రాబోయే 5 రోజుల్లో కూడా ఇదే స్థాయిలో వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.
పది రోజుల్లో కలెక్షన్లు ఎంతంటే ?
విడుదలైన 9వ రోజు కలెక్షన్స్ తక్కువగా నమోదయ్యాయి. 9వ రోజు ఈ సినిమా ఇండియాలో కేవలం రూ. 16 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. కానీ 10వ రోజు సినిమా వసూళ్లలో మెరుగుదల కనిపించింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా 34.50 కోట్లు వసూలు చేసింది. అయితే ఇప్పటికీ ఈ సినిమా ఇండియాలో రూ.500 కోట్ల మార్కు దాటలేకపోయింది. ఇండియాలో ఈ సినిమా కలెక్షన్ 466 కోట్ల రూపాయలకు చేరుకుంది. నార్త్ బెల్ట్ లోనూ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. హిందీలో రూ.190 కోట్లు రాబట్టిన ఈ సినిమా త్వరలో రూ.200 కోట్లు వసూలు చేయనుంది. ఈ చిత్రం తెలుగులో అత్యధికంగా రూ.228.65 కోట్లు వసూలు చేసింది.
వరల్డ్ వైడ్ ఎంతంటే?
ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్లను గమనిస్తే 9 రోజుల్లో వైడ్ గా రూ.800 కోట్లు క్రాస్ చేసింది. ఇప్పటికీ కలెక్షన్లు బాగానే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా శనివారం వసూలైన మొత్తం ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే 11 రోజుల్లో రూ. 1000 కోట్ల గ్రాస్ సాధించడం ఖాయయని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ప్రభాస్ రెండోసారి ఈ ఘనత సాధించిన హీరోగా రికార్డులకు ఎక్కుతాడు. 10 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా కల్కి 466 కోట్లు రాబట్టింది. షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా 10 రోజుల్లో రూ.378 కోట్లు రాబట్టగలిగింది. షారుఖ్ ఖాన్ సినిమాను కల్కి అధిగమించింది. అయితే రామ్ చరణ్ -జూనియర్ ఎన్టీఆర్ ల ఆర్ఆర్ఆర్ ను మాత్రం అధిమించలేకపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమా పది రోజుల్లో అద్భుతమైన వసూళ్లు సాధించింది. 607 కోట్లతో ఇప్పటి వరకు ఫస్ట్ ప్లేస్ లో ఉంది.