Jhanvi Kapoor

Jhanvikapoor : తల్లి సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్న జాన్వీ

Jhanvikapoor : బాలీవుడ్ బ్యూటీ శ్రీదేవి ఆరాధ్య కూతురు జాన్వీ కపూర్ కూడా తన తల్లిలాగే సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. స్టార్ నటీనటులతో సినిమాలు చేసే అవకాశం కూడా ఆమెకు చాలాసార్లు వచ్చింది. జాన్వీకి దైవ భక్తి ఉందనే విషయం అందరికీ తెలిసిందే. దైవ దర్శనం కోసం తిరుమలకు తరచూ వస్తుంటుంది. దీని వెనుక బలమైన కారణం ఉంది.

జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో సౌత్ కి ఎంట్రీ ఇస్తున్నది. తారక్‌తో కలిసి “దేవర`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది. మరోవైపు రామ్ చరణ్‌తో కలిసి “ఆర్‌సి 16`లో నటిస్తుంది. రెండూ పాన్ ఇండియా సినిమాలే. జాన్వీ కపూర్ పాన్-ఇండియన్ చిత్రాల ద్వారా పాన్-ఇండియన్ హీరోయిన్‌గా గుర్తింపు పొందాలనుకుంటోంది. ఇవే కాకుండా తమిళంలో కూడా ఆమెకు పలు క్రేజీ ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం.

జాన్వీ కపూర్ తిరుమలకు తరచూ వస్తుంటారు. ఏడాదికి ఐదు నుంచి ఆరు సార్లు తిరుమలను దర్శించుకుంటారు. అవకాశం దొరికిన ప్రతిసారి తిరుమలకు వస్తుంటారు. అయితే జాన్వీ తిరుమలకు రావడానికి ఓ కారణం ఉంది.

శ్రీదేవికి తిరుమల శ్రీవారంటే అంటే చాలా ఇష్టం. ఆమె కూడా తరచూ తిరుమలను దర్శించుకున్నారు .అప్పట్లో శ్రీదేవి హిందీ కంటే సౌత్ లోనే బిజీ. తెలుగులోనూ చాలా సినిమాలు చేసింది. అందుకే షూటింగ్ సమయంలో శ్రీనివాసుడిని దర్శనం చేసుకునేవారు. అలా తిరుమల వేంకటేశ్వర స్వామి శ్రీదేవికి ఇష్టదైవం అయ్యాడు. శ్రీవారి దర్శనం చేసుకుంటే అంతా సవ్యంగా జరుగుతుందని శ్రీదేవి నమ్మకం. కూతురు జాన్వీ కపూర్ కూడా అదే నమ్మకాన్ని కొనసాగిస్తోంది.

జాన్వీ కపూర్ సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకోవాలనేది తల్లి శ్రీదేవి కోరిక. తల్లి కోర్కెలు తీర్చేందుకు జాన్వీ కూడా తరచూ తిరుమలకు వస్తుంటారు. మొత్తానికి జాన్వీ తిరుమల దర్శనం వెనుక తల్లి బలమైన కోరిక ఉన్నట్లు తెలుస్తోంది.

భారతదేశపు తొలి లేడీ సూపర్‌స్టార్‌గా పేరొందిన శ్రీదేవి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో వందలాది సినిమాలు చేశారు. ఆమె 2018లో దుబాయ్‌లో బాత్‌టబ్‌లో జారిపడి మరణించింది. ఆమె మృతి పై ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. శ్రీదేవి కూతురు జాన్వీ సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంటున్నది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *