FIR ON KOHLI PUB: విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. టీ20 వరల్డ్‌కప్ విజయోత్సవం రోజు రాత్రి కోహ్లీ భార్య, పిల్లలు లండన్ లో ఉండడంతో అక్కడికి వెళ్లిపోయాడు. కానీ, ఇక్కడ భారతదేశంలో అతని రెస్టారెంట్‌పై పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు. బెంగళూరులోని విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ రెస్టారెంట్‌పై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు ఎందుకు చేశారనే దానిపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. బెంగళూరులోని ఎంజీ రోడ్డులో ఉన్న ఈ రెస్టారెంట్‌పై పోలీసులు ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు? అర్థరాత్రి అక్కడ ఏం జరిదింది. పోలీసులు ఎందుకు చర్యలు చర్యలు తీసుకున్నారు. దీనిపై బెంగళూరులోని డీసీపీ వివరాలు వెల్లడించారు.
ఎఫ్‌ఐఆర్ నమోదు కు కారణాలేంటి?
బెంగళూరులోని 3-4 పబ్ లు రాత్రి 1.30 గంటల వరకు తెరిచి ఉంచినట్లు తమకు ఫిర్యాదులు అందాయని, వాటిపై కేసు నమోదు చేశామని డీసీపీ సెంట్రల్ తెలిపారు. అక్కడ నుంచి పెద్ద పెద్ద శబ్దాలతో మ్యూజిక్ ప్లే చేస్తున్నారని ఫిర్యాదు అందినట్లు వివరించారు. నగరంలోని పబ్‌ల రాత్రి 1 గంట వరకు మాత్రమే తెరిచి ఉంచేందుకు అనుమతి ఉందని, ఆ తర్వాత కాదని స్పష్టం చేశారు.
దేశంలోని అనేక నగరాల్లో One8 కమ్యూన్ చైన్
విరాట్ కోహ్లీకి వన్8 కమ్యూన్ పేరుతో దేశంలోని అనేక నగరాల్లో రెస్టారెంట్లు పబ్ లు ఉన్నాయి. బెంగుళూరు, ముంబైతో పాటు, గత సంవత్సరం కూడా విరాట్ గురుగ్రామ్‌లో ఈ పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించాడు.