naspur lo tension
naspur lo tension

Naspur: నస్పూర్‌లో టెన్షన్..టెన్షన్ !

ఆక్రమణల కూల్చివేత తప్పదా
బీఆర్ఎస్ నేతలే టార్గెట్టా? లేక దిద్దుబాటు చర్యలా?
తదుపరి కార్యాచరణ ఏమిటని మంచిర్యాల జిల్లాలో చర్చలు

Naspur : మంచిర్యాలలోని నస్పూర్‌లో డీకొండ అన్నయ్య నిర్మించిన భవనం ప్రభుత్వ స్థలంలో ఉందని, అక్రమ నిర్మాణమని ఇటీవల మున్సిపల్ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారా..? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్వే నంబర్ 42లో సుమారు 100కు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని ఇదివరకే రెవెన్యూ, మున్సిపల్ అధికారులు గుర్తించారని చెప్పకనే చెప్పారు. వాటిపై చర్యలు ఏమైనా ఉన్నాయా..? లేదంటే తూ…తూ…. మంత్రంగా వదిలేస్తారా…? ఒకవేళ చర్యలు చేపడితే పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూమి బయటపడనుంది.

బీఆర్ఎస్ నేతల టార్గెట్?

నస్పూర్ కౌన్సిలర్ బేర సత్యనారాయణ ఇంటి ముందు గల రోడ్డును కొంత తొలగించిన అధికారులు బీఆర్ఎస్ నాయకుడు డీకొండా అన్నయ్యకు చెందిన ఐదంతస్తుల భవనాన్ని ఇటీవల అధికారులు కూల్చి వేసిన విషయం తెలిసిందే. అయితే దాని పక్కనే ఉన్న మరో ఇల్లీగల్ భవనాన్ని కూల్చివేయకుండా కేవలం ఒక భవనాన్ని కూల్చివేయడంపై పలు అనుమానాలు రేపెత్తుతున్నాయి. కేవలం బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులను టార్గెట్ చేసుకొని భవనాల కూల్చివేత కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని పలువురు, మున్సిపల్ వాసులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.

తోళ్లవాగు వద్ద ఆక్రమణల మాటేమిటి?

మంచిర్యాల పట్టణంలోని చెరువులను ఆనుకోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్, శిఖం భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై సంబంధి శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. లక్షల్లో మామూళ్లు ముట్టడంతో అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దీనికి తోడు ఎమ్మెల్యే సైతం ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై పలు అనుమానాలు వెలువెత్తుతున్నాయి. కొందరినే టార్గెట్ చేస్తూ నిర్మాణాలను కూల్చి వేస్తున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ ఆక్రమణ కూల్చివేతల పర్వం మొదలైందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇరిగేషన్ అధికారుల అండదండలతో..

జిల్లాలోని ఇరిగేషన్ శాఖ అధికారుల అండదండలు జోరుగా కొనసాగుతోంది. బఫర్, శిఖం, ఎఫ్టీఎల్ లెవెల్ లో ఉన్నప్పుడు ఇరిగేషన్ అధికారులు అనుమతి ఇవ్వరాదు. కానీ ఎలాంటి అనుమతి లేకుండా భవన నిర్మాణాలు ఎలా సాగుతున్నాయి..? జిల్లా కేంద్రంలోని రాముని చెరువును ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టినా సంబంధిత శాఖ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. ఏదైనా భారీ ప్రమాదం జరిగితే.. సంబంధిత ప్రమాదానికి కారకులు ఎవరు…? వారికి అన్యాయానికి సమాధానం ఎవరు చెప్తారు..? ఇరిగేషన్ అధికారుల సహకారంతోనే బఫర్ జోన్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థాకంగా చర్చ జరుగుతున్నది. సంబంధించిన శాఖ అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

శెనార్తి మీడియా, మంచిర్యాల :

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *