- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి
- మంచిర్యాలలో భారతీయ జనతా పార్టీ బైక్ ర్యాలీ
BJP Rally : మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోరాటాలు ఆగవని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీల వైఫల్యాలపై సోమవారం బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో తలపెట్టిన బైక్ ర్యాలీలో రఘునాథ్ రావు హాజరై మాట్లాడారు.
బైక్ ర్యాలీ అనుమతి కోసం బీజేపీ నాలుగు రోజుల క్రితం మంచిర్యాల ఏసీపీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి దాకా పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు బైక్ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ర్యాలీని పోలీసులు అడ్డుకోగా రఘునాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ శ్రేణులు నస్పూర్ కలెక్టరేట్ నూతన ద్వారం నుంచి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఓవర్ బ్రిడ్జి మీదుగా శ్రీనివాస్ టాకీస్ రోడ్, ముఖారం చౌరస్తా, అర్చన టెక్స్ చౌరస్తా, మార్కెట్ రోడ్, బెల్లంపల్లి చౌరస్తా మీదుగా బీజేపీ జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది.
కార్యక్రమంలో పార్టీ నాయకులు రజనీష్ జైన్, ఎనగందుల కృష్ణ మూర్తి, బొలిశెట్టి అశ్విన్, గుండా ప్రభాకర్, మాదవరపు వెంకట రమణ రావు, జోగుల శ్రీదేవి, బింగి ప్రవీణ్, సత్రం రమేష్, రెడ్డిమల్ల అశోక్, రాకేష్ రెన్వా, కుర్రే చక్రి, ఈర్ల సదానందం, పొన్నవేణి సదానందం తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల