Chandra babu Oath Taking

Chandra Babu Naidu: నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠంపై చంద్రబాబు

Chandra Babu Naidu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సీఎంగా చంద్రబాబు నాయుడుతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణం చేశారు. పవన్ కల్యాణ్ కొత్త ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవిని చేపట్టబోతున్నట్లు తెలిసింది. చంద్రబాబు నాయుడు గతంలో మూడు సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారు. ఈ వేడుకకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం ముగిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ హత్తుకొని అభినందనలు తెలిపారు.

25 మంది మంత్రులు
చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఎన్డీయే నేతృత్వంలోని ప్రభుత్వంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సీఎంగా చేసే అవకాశాలు ఉన్నాయి. మంత్రుల జాబితాలో జనసేన పార్టీ నుంచి చెందిన ముగ్గురు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి మంత్రులుగా ప్రమాణం చేశారు. మిగిలిన వారు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ప్రమాణ స్వీకారోత్సవానికి దక్షిణాది సూపర్ స్టార్లు చిరంజీవి, రజనీకాంత్ కూడా హాజరయ్యారు.

వేడుకకు ప్రధాని మోదీ, అమిత్ షా సహా పలువురు హాజరు
మంత్రి మండలిలో చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ ఏపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు కే అచ్చెన్నాయుడు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు, ఎన్డీయే మిత్రపక్షాల నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. మంగళవారం అర్థరాత్రి అమరావతిలోని తన నివాసంలో అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశమైన తర్వాత చంద్రబాబునాయుడు మంత్రి మండలిని ఖరారు చేశారు.

17 మంది మంత్రులు కొత్తవాళ్లే
చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో 17 మంది కొత్త వారే. మిగిలిన వారు గతంలో మంత్రులుగా పని చేశారు. టీడీపీ అధినేత ఒక పోస్టును ఖాళీగా ఉంచారు. మంత్రి మండలిలో ముగ్గురు మహిళలున్నారు. మంత్రి మండలిలో సీనియర్ నాయకుడు ఎన్ మహ్మద్ ఫరూఖ్ ఒక్కరే ముస్లిం. మంత్రుల జాబితాలో బీసీల నుంచి ఎనిమిది మంది, ఎస్సీల నంచి ముగ్గురు, ఎస్టీ నుంచి ఒకరు ఉన్నారు. కమ్మ, కాపు సామాజిక వర్గాలకు చెందిన ఒక్కొక్కరు చొప్పున నలుగురు మంత్రులను మంత్రి మండలిలో చేర్చుకున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి ముగ్గురు, వైశ్య సామాజిక వర్గం నుంచి ఒకరికి ఒకరికి మంత్రివర్గంలో అవకాశం దక్కింది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *