kgbv nasupr

KGBV: హాస్టల్ నుంచి తీసుకెళ్లడం లేదని మనస్తాపం

  • బిల్డింగ్ పై నుంచి దూకిన విద్యార్థిని
  • మంచిర్యాల జిల్లా నస్పూర్ లో ఘటన

శెనార్తి మీడియా, మంచిర్యాల :

KGBV: హాస్టల్ నుంచి తల్లిదండ్రులు తనను ఇంటికి తీసుకువెళ్లడం లేదంటూ భవనం పైనుంచి ఓ విద్యార్థిని దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన నస్పూరులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాల్టిలోని కస్తూర్భా గాంధీ లో చదువుతున్న అలువాల అక్షర (11) ఆరో తరగతి చదువుతోంది. తాను హాస్టల్ లో ఉండనని.. ఇంటికి వస్తానంటూ కొన్ని రోజుల నుంచి తల్లిదండ్రులతో చెబుతున్నది. హాస్టల్లోనే ఉండి బాగా చదువుకోవాలంటూ అక్షరను సముదాయిస్తున్నారు. ఇక తనను ఇంటికి తీసుకెళ్లరని భావించిన బాలిక బుధవారం తెల్లవారుజామున 5:45 గంటలకు హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన హాస్టల్ సిబ్బంది అక్షరను చికిత్స నిమిత్తం హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స చేసిన అనంతరం వెన్నెముకలోని ఎల్ 4 కి గాయమైందని, మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్, హైదరాబాద్ కి తీసుకొని వెళ్లాలని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సూచించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *