Senior Maoist Dead: మావోయిస్టులకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. వరుస ఎన్ కౌంటర్లతో ఉన్న క్యాడర్ కాస్త తుడిచిపెట్టుకుపోతున్నది. కొత్త రిక్రూట్ మెంట్లు లేకపోగా ఉన్నవాళ్లు ఎన్ కౌంటర్లలో చనిపోవడం లేదా లొంగుబాటుతుండడంతో మావోయిస్టు పార్టీ బలహీన పడిపోతున్నది. ఈ ఏడాది జరిగిన ఎన్ కౌంటర్లలో దాదాపు 150 మందికి పైగా మావోయిస్టులు చనిపోగా, మరికొందరు గాయాలపాలయ్యారు.
ఇప్పటికే ముప్పాళ్ల గణపతి, ఆర్కే లాంటి మావోయిస్టు అగ్రనేతలు అనారోగ్యంతో చనిపోగా, మరో నేత కూడా చనిపోయినట్లు పోలీసులు ధ్రువీకరించారు.
మావోయిస్టు అగ్రనేత, తొలితరం నాయకుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ @ దాదా రణదేవ్ దాదా. ఈయన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర మిలిటరీ ఇన్చార్జిగా, మహారాష్ట్ర-ఛత్తీస్‌ఘడ్ బార్డర్ ఇన్చార్జిగా పని చేశాడు. మంగళవారం చత్తీస్ ఘడ్ లో జరిగిన ఎన్ కౌంటర్లో చనిపోయాడు. ఏసోబు మృతిని దంతేవాడ పోలీసుల ధ్రువీకరించారు. ఈ అగ్రనేత స్వగ్రామం తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం గ్రామం అని దంతేవాడ ఎస్పీ ప్రకటించాడు.