పూర్తి ఆధారాలతో నేరస్తులకు శిక్ష పడేలా పనిచేయాలి
త్రీ లేయర్ పద్ధతి ద్వారా ఎన్‌బీడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేయాలి
రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్
Police Review : కేసుల విచారణలో పారదర్శకత పాటించాలని, పూర్తి ఆధారాలతో నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పోలీస్ అధికారులకు సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని బెల్లంపల్లి సబ్ డివిజన్ సీఐ, పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అధికారులతో కమిషనరెట్ లో యూఐ కేసులు, గ్రేవ్ యూఐ లాంగ్ పెండింగ్‌లో కేసుల పరిష్కారం, ఎస్సీ, ఎస్టీ యూఐ కేసులు, ఉమెన్ ఎగైనెస్ట్ కేసులు, పోక్సో కేసుల పరిష్కారం, ఎనీడీ పీఎస్ యాక్ట్ కేసుల, పెండింగ్ కేసులపై రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ గురువారం సమీక్ష సమీక్షా నిర్వహించారు.
ఈ సందర్బంగా సీపీ మాట్లాడారు విచారణలో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని సూచించారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి పారదర్శకంగా కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. ప్రతి సీడీ ఫైల్ ను, అందులో ఉన్న డాక్యుమెంట్స్ ను పరిశీలించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న సీసీ నెంబర్లు తీసుకోవాలన్నారు. ప్రతి ఫైల్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం సీడీ ఫైల్ పొందుపరచాలని తెలిపారు. ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని సీపీ అధికారులకు సూచించారు. పక్కా ఆధారాలతో కేసులు నమోదు చేసి నేరస్తులకు శిక్ష పడేలా చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. నేరాల నియంత్రణకు విసిబుల్ పోలీసింగ్, నిరంతర పెట్రోలింగ్ తో పాటు సాంకేతిక వ్యవస్థను కూడా ఉపయోగించుకోవాలన్నారు. పెట్రోల్ కార్ నిరంతరం 24×7 గస్తీ నిర్వహిస్తూ, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించలన్నారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని చెప్పారు. ప్రజల సమస్యలను చట్ట పరిధిలో తీర్చాలని, ప్రజావాణి, సీసీసీ ద్వారా వచ్చిన పిటిషన్ లు త్వరితగతిన విచారణ జరిపి చట్ట పరిధిలో బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. దానికి సంబంధించిన రిప్లై లను పంపించాలని సూచించారు.
త్రీ లేయర్ (Three Layer) పద్ధతి ద్వారా ఎన్ బీ డబ్ల్యూ స్ ఎగ్జిక్యూట్ చేయాల్నారు. మొదట కమిషనరేట్ పరిధిలో, రెండోది రాష్ట్ర పరిధిలో, మూడో లేయర్ లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్ ఎన్‌బీడబ్ల్యూస్‌ను విభజించి ప్రణాళిక ప్రకారం ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి ఎగ్జిక్యూట్ చేయాలని సీపీ సూచించారు. ఆయా ఠాణాల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పాన్ షాపులు, కిరాణ షాపులు, పాఠశాలలు, కాలేజీ ల వద్ద తనిఖీలు చేపట్టాలన్నారు. గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాల విక్రయాలతో పాటు రవాణాకు పాల్పడుతున్న వారిపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు , బెల్లంపల్లి సబ్ డివిజన్ సీఐలు, సీసీఆర్బీ ఇన్ స్పెక్టర్ బుద్దె స్వామి, ఎస్ఐలు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల/గోదావరిఖని :