పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన కార్మికుడు
మంచిర్యాల మున్సిపాలిటీలో ఘటన
శెనార్తి మీడియా, మంచిర్యాల :
Muncipal Labour Sucide: మంచిర్యాల మున్సిపాలిటీకి చెందిన కాంట్రాక్టు కార్మికుడు నవీన్ పురుగుల మందు ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడు ప్రస్తుతం మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐదో వార్డు కౌన్సిలర్, మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సుధమల హరికిషన్ ఉద్యోగాలు పెట్టిస్తానని తమ నుంచి డబ్బులు తీసుకొని మోసగించాడని బాధితుడు నవీన్ తెలిపాడు. తనను మధ్యవర్తిగా పెట్టి డబ్బులు వసూలు చేయించాడని, బాధితుడు వెల్లడించారు.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం
సుధమల హరికృష్ణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. పదేళ్లుగా ఏ ఒక్క రోజు కూడా డబ్బులు వసూలు చేయకుండా పనిచేసిన దాఖలాలు లేవు. పదేళ్లలో ఏ ఒక్కరి పేరు కూడా ఎక్కించినటువంటి దాఖలాలువ లేవు. గత ఏడాది కొంతమంది పేర్లు ఎక్కించుకునే కార్మికులను సున్నం బట్టి వాడలో ఉన్న జిమ్ వద్దకు పిలిపించుకున్నాడని, మీ పేర్లు ఎక్కించడానిక రూ. 50వేలు ఖర్చు అవుతాయని, రూ. 50 వేలు ఇచ్చిన వారి పేర్లు ఎక్కిస్తామని కార్మికుల ముందు చెప్పాడని బాధితుడు నవీన్ తెలిపాడు. అప్పుడు తనతో డబ్బులు వసూలు చేయించినట్లు చెప్పాడు. ఎనిమిది మంది డబ్బులు ఇవ్వగా హరికృష్ణకు ఇచ్చినట్లు చెప్పాడు. ఆ డబ్బులను వాడుకొని ప్రభుత్వం మారాక యూనియన్ గౌరవాధ్యక్షుడు సుధమల హరికృష్ణను పిలిపించి కార్మికుల అందరి ముందు పంచాయితీ పెట్టామని చెప్పార.అప్పుడు డబ్బులు ఇస్తానని చెప్పి నమ్మించాడని, రోజులు గడిచిన కొద్దీ ఆ డబ్బులతో తనకు సంబంధం లేదంటున్నాడని చెప్పాడు. దీంతో కార్మికుల అందరం కలిసి యూనియన్ గౌరవాధ్యక్షుడు హరికృష్ణ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు .అదే హరికృష్ణ యూనియన్ పెట్టినప్పటి నుంచి ఏ రోజు కూడా డబ్బులు వసూలు చేయకుండా ఒక్క కార్మికుడికి కూడా పని చేయలేదని చెప్పాడు .