BC Association: కేంద్ర ప్రభుత్వం బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రాలలో బీసీ మంత్రిత్వ శాఖ ఉన్నట్లు కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. బీసీ డిమాండ్ల పరిష్కాకరానికి బీసీలను రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయడానికి, బీసీ హక్కుల పరిష్కారానికి కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేకపోవడంతో బీసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికైనా బీజేపీ బీసీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, నాయకులు శ్రీపతి రాములు, శాఖపురి భీంసేన్, కట్కూరి శ్రీనివాస్, అంకం సతీష్, తన్నీరు భీంరావు తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల