Wife Andolana: భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరో యువతితో సహజీవనం చేస్తున్నాడో యువకుడు. ఈ ఘటన కేశవపట్నంలో చోటు చేసుకుంది. కేశవపట్నానికి చెందిన బొంగోని ప్రవీణ్ కు, తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామానికి చెందిన శిరీషతో ఆరేళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరికో పాప కూడా ఉంది. పాప పుట్టిన అనంతరం వారి దంపతుల మధ్య కలహాలు మొదలయ్యాయి. ఐదేళ్లుగా వీరు వేర్వేరుగా ఉంటున్నారు. భార్య,కూతురు ఉండగానే ఇటీవల ప్రవీణ్ మరో అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శిరీష తనకున్యాయం చేయాలని కోరుతూ అత్తింటి ముందు బైఠాయించింది.
శెనార్తి మీడియా,శంకరపట్నం :