Jasprit Bumrah

Jasprit Bumrah : ఏడాది క్రితం కెరీర్ ముగిసిందనుకున్నారు.? కానీ తిరిగొచ్చాకా విధ్వంసం

Jasprit Bumrah : 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ గెలుపొందింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఏడాది క్రితం, జస్ప్రీత్ బుమ్రా కెరీర్ ముగిసినట్లేనని అంతా అనుకున్నారు. గాయం కారణంగా బూమ్రా దాదాపు 12 నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. అయితే తిరిగి వచ్చిన తర్వాత బుమ్రా తన బౌలింగ్ లో మరింత ప్రమాదకరంగా మారాడు. వన్డే ప్రపంచకప్‌ నుంచి టెస్టు సిరీస్‌, ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌ వరకు బుమ్రాకు బ్యాట్స్‌మెన్‌ వద్ద సమాధానం లేదు. బుమ్రాను అత్యుత్తమంగా మార్చిన నాలుగు కారణాలేంటో తెలుసుకుందాం

భిన్నమైన యాక్షన్

బూమ్రా బౌలింగ్ యాక్షన్ చాలా భిన్నమైనది. ఇందులో చేతులు ఊపిన స్టైల్ మాత్రమే కాకుండా షార్ట్ రన్ అప్ నుంచి మరింత స్పీడ్ పెంచడం అతడి ప్రత్యేకత. బంతిని విడుదల చేయడంలో, పిచ్ నుంచి అవసరమైన బౌన్స్ పొందడంలో అతని నైపుణ్యం బ్యాట్స్‌మన్‌కు మిస్టరీయే.

పరిస్థితులకు అనూలంగా మారిపోవడం

కచ్చితమైన యార్కర్లు, స్లో బంతుల్లో డాడ్జింగ్, ప్రమాదకరమైన బౌన్సర్లు.. బహుశా చాలా మంది ఇతర బౌలర్లు ఇవన్నీ కలిగి ఉంటారు. కానీ బుమ్రా ప్రత్యేకత ఏమిటంటే అతను ఫార్మాట్, పరిస్థితులు, పిచ్‌ ను త్వరగా తనకు అనుకూలంగా మారుతుంటాడు.

ఇంటెలింజెంట్ బౌలింగ్

ఆట పరిస్థితిని బట్టి బ్యాట్స్‌మెన్ మనస్తత్వాన్ని ఎలా పసిగట్టాలో బుమ్రాకు బాగా తెలుసు. ఆట ఏ మలుపు తిరిగినా, ఆలోచనలో బ్యాట్స్‌మెన్‌ను ఎలా వదిలేయాలో అతనికి తెలుసు. పరిస్థితులకు అనుగుణంగా పేస్, యాంగిల్ మార్చడం ద్వారా బ్యాట్స్‌మన్‌ను కొంత గందరగోళానికి గురి చేస్తాడు.

స్థిరమైన కచ్చితత్వం

కొన్నిసార్లు ఫాస్ట్ బౌలర్లు ఒత్తిడిలో లేదా ప్రణాళికల్లో మార్పు వచ్చినప్పుడు లయ కోల్పోతారు. అధిక వేగంతో బౌలింగ్ చేస్తున్నప్పటికీ స్థిరమైన కచ్చితత్వాన్ని కొనసాగించడం బుమ్రా ప్రత్యేకత. ఈ కారణంగా, మూడు ఫార్మాట్లలో అతని ఎకానమీ, స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉంది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *