World Cup Winner Team India

T20 World Cup 2024: 17 ఏళ్ల కల ఫలించిన వేళ.. విశ్వవిజేతగా టీమిండియా

T20 World Cup 2024: రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు చరిత్ర సృష్టించింది. ఈ జట్టు చరిత్రలో రెండో సారి ప్రపంచకప్ (ODI, T20) టైటిల్‌ సాధించింది. శనివారం (జూన్ 29) జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఏడు పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. ఈ విజయంతో 140 కోట్ల మంది భారతీయులు సంబురాలు చేసుకుంటున్నారు.

టీమిండియా రెండు స్లారుల వన్డే ప్రపంచకప్‌ (1983,2011)ను గెలిచిన విషయం తెలిసిందే. కాగా టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను రెండుసార్లు మాత్రమే (2007, 2024) గెలుచుకుంది. టీమిండియా చివరిసారిగా 2011లో ప్రపంచకప్ (ODIలో) గెలుచుకుంది. సరిగ్గా 13 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ (టీ20లో) టైటిల్‌ చేజిక్కించుకుంది.

సౌతాఫ్రికాను కాపడని క్లాసెన్ అర్ధశతకం
క్లాసెన్ అర్ధశతకం సౌతాఫ్రికాను గెలిపించలేకపోయింది. బార్బడోస్ వేదికగా జరిగిన ఈ ఫైనల్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి సమాధానంగా సౌతాఫ్రికా 8 వికెట్లకు 169 పరుగులు మాత్రమే చేసి టైటిల్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. దీని తర్వాత క్వింటన్ డి కాక్, ట్రిస్టన్ స్టబ్స్ 38 బంతుల్లో 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 31 పరుగుల వద్ద స్టబ్స్ ఔటయ్యాడు. హెన్రిచ్ క్లాసెన్‌తో కలిసి డి కాక్ 36 పరుగులు జోడించాడు. స్పిన్నర్లకు వ్యతిరేకంగా డీ కాక్, క్లాసెన్ తమ అడుగులు వేసినప్పుడు, రోహిత్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను రంగంలోకి దించాడు. దీంతో డి కాక్ వికెట్ ఇచ్చి వెళ్లక తప్పలేదు. 39 పరుగులు చేసి నిష్క్రమించాడు.

ఆఖరి ఓవర్లో పాండ్యా ..
క్లాసెన్ బ్యాట్ ఝుళిపించడంతో మ్యాచ్ భారత్ చేతుల్లోంచి జారిపోతుందనిపించింది. రోహిత్ వేసిన ఎత్తుగడ ఫలించింది. హార్దిక్ పాండ్యాను బౌలింగ్‌ లోకి దించాడు. ముందుగా క్లాసెన్‌ను ఓటౌ చేశాడు. 27 బంతుల్లో 52 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. దీని తర్వాత మొత్తం సౌతాఫ్రికి జట్టు నిలబడలేకపోవడంతో కప్పు చేజారింది.
భారత జట్టులో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 20 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. పేసర్లు అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా చెరో 2 వికెట్లు పడగొట్టారు. స్పిన్నర్ అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు. చివరి ఓవర్‌లో 16 పరుగులు చేయాల్సి ఉండగా, పాండ్యా 8 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ని గెలిపించాడు.

ఫైనల్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఏడు వికెట్ల కోల్పోయి 176 పరుగులు చేసింది. ఓ దశలో భారత్ 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత విరాట్ కోహ్లీ బాధ్యతలు భుజాన వేసుకున్నాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్ పటేల్‌తో కలిసి 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కోహ్లీ 48 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో అతనికిదే తొలి అర్ధశతకం. కోహ్లి 59 బంతుల్లో మొత్తం 76 పరుగులు చేశాడు. కాగా అక్షర్ 31 బంతుల్లో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక మ్యాచ్ చివర్లో శివమ్ దూబే 16 బంతుల్లో 27 పరుగులు సాధించాడు. మరోవైపు సౌతాఫ్రికా తరఫున స్పిన్నర్ కేశవ్ మహరాజ్, పేసర్ ఎన్రిక్ నార్సియా చెరో 2 వికెట్లు తీశారు. మార్కో జాన్సెన్, కగిసో రబడా 1-1 వికెట్లు తీశారు.

గత 9 టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో టాస్ గెలిచిన జట్లు 8 మ్యాచ్‌ల్లో గెలిచాయి. అలాగే, 2010 తర్వాత టీ20 ప్రపంచకప్‌లో పగటిపూట ఫైనల్‌ ఆడడం ఇదే తొలిసారి. భారత్, సౌతాఫ్రికా జట్లు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా ఫైనల్స్‌కు చేరుకున్నాయి. అయితే ఫైనల్లో ఆఫ్రికా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ కోసం, భారత కెప్టెన్, దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ వారి ప్లేయింగ్-11లో ఎటువంటి మార్పులు చేయలేదు.

మూడోసారి ఫైనల్ కు టీమిండియా
17 ఏళ్ల తర్వాత రోహిత్ కెప్టెన్సీలో టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఈసారి భారత జట్టు 68 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి టైటిల్‌ మ్యాచ్‌లో చేరింది. మరోవైపు తొలి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది.

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు మూడోసారి ఫైనల్‌కు చేరుకుంది. అన్నింటిలో మొదటిది, ఫైనల్ మొదటి సీజన్‌లో అంటే 2007లో ఆడింది. ఆ తర్వాత పాకిస్థాన్‌ను ఓడించి టైటిల్ కూడా కైవసం చేసుకుంది. 7 సంవత్సరాల తర్వాత అంటే 2014 సీజన్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత శ్రీలంక చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు ఆ జట్టు చాంపియన్‌గా నిలిచిన మూడో ఫైనల్‌.

భారత్-ఆఫ్రికా మధ్య హోరాహోరీ పోరు
మొత్తం వన్డే మ్యాచ్‌లు: 91.
భారత్ గెలిచింది: 40, దక్షిణాఫ్రికా గెలిచింది: 51, ఫలితం లేదు: 3
మొత్తం టీ20 మ్యాచ్‌లు: 27, భారత్ గెలిచింది: 15, సౌతాఫ్రికా గెలిచింది: 11, ఫలితం తేలనిది: 1

మొత్తం టెస్ట్ మ్యాచ్‌లు: 44, భారత్ గెలిచింది : 16 , దక్షిణాఫ్రికా గెలిచింది: 18, డ్రా: 10

టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య హోరాహోరీగా తలపడనుంది
మొత్తం టీ20 మ్యాచ్‌లు: 7
భారత్ గెలిచింది: 5
దక్షిణాఫ్రికా గెలిచింది: 2

మ్యాచ్‌లో భారత్-దక్షిణాఫ్రికా ప్లేయింగ్-11

టీమిండియా : రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.

దక్షిణాఫ్రికా జట్టు: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నార్కియా మరియు తబ్రైజ్ షమ్సీ.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *