Team India New Record: ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన సూపర్-8 మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరు నమోదు చేసింది. ఈ సమయంలో భారత బ్యాట్స్‌మెన్ అద్భుత ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ 17 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టి, ప్రపంచకప్‌లో గతంలో ఎన్నడూ చేయలేని ఘనతను సాధించారు.
17 ఏళ్ల రికార్డును టీమిండియా బద్దలు కొట్టింది
ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. భారత జట్టు ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 13 సిక్సర్లు (Sixes) నమోదయ్యాయి. టీ20 ప్రపంచకప్ చరిత్రలో టీమ్ ఇండియా ఒక మ్యాచ్‌లో ఇన్ని సిక్సర్లు బాదడం ఇదే తొలిసారి. అంతకుముందు 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 11 సిక్సర్లు కొట్టింది. అయితే ఇప్పుడు ఈ రికార్డును టీమిండియా బద్దలు కొట్టింది.
ప్రపంచకప్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు టీమిండియావే
13 సిక్సర్లు – వర్సెస్ బంగ్లాదేశ్, ఆంటిగ్వా, 2024
11 సిక్సర్లు – vs ఇంగ్లాండ్, డర్బన్, 2007
10 సిక్సర్లు – vs ఆస్ట్రేలియా, డర్బన్, 2007
10 సిక్సర్లు – vs ఆఫ్ఘనిస్తాన్, అబుదాబి, 2021
టీ20 ప్రపంచకప్‌లో 11వ సారి 180 పరుగులు (highest score)
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా 11వ సారి 180+ పరుగులు చేసింది. టీ20 ప్రపంచకప్‌లో అత్యధికంగా 180+ పరుగులు చేసిన జట్టుగా టీమ్ ఇండియా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ జాబితాలో భారత జట్టు ఇంగ్లండ్‌ను వెనక్కు నెట్టింది. టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఇప్పటివరకు 10 సార్లు 180+ పరుగులు చేసింది.
T20 ప్రపంచకప్‌లో అత్యధిక సార్లు 180+ పరుగులు (highest score) చేసిన జట్లు
11 సార్లు – భారతదేశం
10 సార్లు – ఇంగ్లాండ్
9 సార్లు – దక్షిణాఫ్రికా
8 సార్లు – పాకిస్తాన్