Food-to-Avoid-for-Better-Sleep

Foods to avoid at night: రాత్రిపూట పొరపాటున కూడా ఈ కూరగాయలను తినకండి

Foods to avoid at night: రాత్రిపూట కొన్ని కూరగాయలను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రాత్రిపూట తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. కొన్ని కూరగాయలు జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దీని వల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

రాత్రిపూట సంభవించే జీర్ణ సమస్యలు మీ నిద్రలో కూడా సమస్యలను కలిగిస్తాయి. దీని కారణంగా నిద్రకు భంగం కలగవచ్చు. నిద్రలేమి సమస్య తలెత్తవచ్చు. పొట్ట, నిద్ర సమస్యల కారణంగా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. రాత్రిపూట మానుకోవల్సిన 5 కూరగాయల గురించి తెలుసుకుందాం.

వంకాయ(brinjal)

వంకాయలో సోలనిన్ అనే మూలకం ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల కడుపులో భారంగా అనిపించవచ్చు. రాత్రిపూట దీనిని తీసుకోవడం మానుకోవాలి.

టొమాటో(Tomato)

టొమాటోలో ఎసిడిటీని కలిగించే గుణాలు ఉంటాయి. రాత్రిపూట దీనిని తినడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ లేదా గుండెల్లో మంట వస్తుంది. దీని కారణంగా నిద్ర కూడా పాడవుతుంది.

మిరపకాయ

మిరపకాయలో ఉండే క్యాప్సైసిన్ మూలకం శరీరంలో వేడిని పెంచుతుంది. మిరప అధిక వినియోగం కడుపులో వేడిని కలిగిస్తుంది. రాత్రిపూట దీన్ని తినడం వల్ల ఉదర సమస్యలు, జీర్ణ సమస్యలు వస్తాయి. అందువల్ల, రాత్రిపూట మిరపకాయలకు దూరంగా ఉండడం మేలు.

కాలీఫ్లవర్

రాత్రిపూట గ్యాస్ ఎక్కువగా వచ్చే కూరగాయలలో క్యాబేజీ ఒకటి. రాత్రిపూట దీన్ని తింటే పొట్టలో గ్యాస్, ఎసిడిటీ సమస్యలు వస్తాయి. దీని కారణంగా నిద్రకు భంగం కలుగుతుంది.

బెండకాయ(ladyfinger)

బెండకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది, అయితే ఇది జీర్ణవ్యవస్థను మందగించే కొన్ని అంశాలను కూడా కలిగి ఉంటుంది. రాత్రిపూట దీన్ని తినడం వల్ల జీర్ణ సమస్యలు, నిద్రకు ఇబ్బంది కలుగుతుంది.

సూచన ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏదైనా ఔషధం లేదా చికిత్సకు ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించండి.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *