NEET UG & PG-2024 : దేశంలోని వైద్య కోర్సుల్లో ప్రవేశం పొందడానికి నీట్ పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిససరి. నీట్ పరీక్ష రెండు రకాలు. ఒకటి నీట్ యూజీ, రెండోది నీట్ పీజీ పరీక్ష. ఇప్పుడు నీట్ యూజీ, నీట్ పీజీ పరీక్షలు ఎందుకు నిర్వహిస్తారు. వాటిలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఏయే కోర్సు్లో ప్రవేశం పొంవదచ్చు. నీట్ ఫలితం, పేపర్ లీక్ వివాదం ఏమిటి; ఇటీవల నీట్ పీజీ పరీక్ష ఎందుకు వాయిదా పడింది? ఈ వివాదం, వివరాలేమిటో పూర్తిగా తెలుసుకుందాం.
నీట్ (NEET UG & PG) పరీక్ష ఎందుకు?
నీట్ (NEET UG), నీట్ పీజీ (NEET PG) పరీక్షలు ఎందుకు జరుగుతాయి అనే ప్రశ్న ఉంటే, అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ప్రవేశం కోసం NEET UG (అండర్ గ్రాడ్యుయేట్ కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) నిర్వహిస్తున్నారు. అదే సమయంలో, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ప్రవేశానికి NEET PG (పోస్ట్ గ్రాడ్యుయేట్ కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) నిర్వహిస్తున్నారు. దేశంలోని వైద్య కోర్సుల్లో ప్రవేశానికి ఈ రెండు పరీక్షలు ఏటా నిర్వహిస్తారు.
నీట్ పీజీ పరీక్ష ఎందుకు వాయిదాకు కారణాలేంటి? నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది, కొత్త తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. ఇటీవలి కొన్ని పోటీ పరీక్షల్లో చోటుచేసుకున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, వైద్య విద్యార్థుల కోసం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నిర్వహించే నీట్-పీజీ ప్రవేశ పరీక్ష విధానాలను క్షుణ్ణంగా విశ్లేషించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా, జూన్ 23, 2024న నిర్వహించాల్సిన నీట్-పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించారు. విద్యార్థులకు కలిగిన అసౌకర్యానికి హృదయపూర్వకంగా పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ, విద్యార్థుల ప్రయోజనాల కోసం, పరీక్షా ప్రక్రియ పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
నీట్ పీజీ ద్వారా ఏయే కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది?
నీట్ యూజీ (NEET UG) పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, పలు పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో
మాస్టర్ ఆఫ్ సర్జరీ (MD)
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (MS)
పీజీ డిప్లొమా కోర్సులు ఉన్నాయి.
నీట్ యూజీ (NEET UG) ద్వారా ఏయే కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు?
నీట్ యూజీ NEET UG పరీక్ష వివిధ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ కింది కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.
బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్.. & బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (MBBS)
బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (BDS)
బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BAMS)
బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BHMS)
బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగా సైన్సెస్ BNYS)
బ్యాచిలర్ ఆఫ్ యునాని మెడిసిన్ అండ్ సర్జరీ (BUMS)
బ్యాచిలర్ ఆఫ్ సిద్ధ మెడిసిన్ అండ్ సర్జరీ (BSMS)
బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ (BVSc & AH)
బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (BPT)
నర్సింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BSc నర్సింగ్) కోర్సులు.
వీటిలో చాలా మంది అభ్యర్థులు BDS, BAMS, BHMSలను తమ మొదటి ప్రాధాన్యమిస్తుంటారు
నీట్ యూజీ (NEET UG) పరీక్ష ఫలితాల వివాదం ఏమిటి?
ఈ సంవత్సరంనీట్ యూజీ (NEET UG) పరీక్ష మే 5న జరిగింది. దాని ఫలితాలు జూన్ 4న విడుదలయ్యాయి. ఫలితాలు వెలువడినప్పటి నుంచి వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఫలితాలు వెలువడిన వెంటనే నీట్ విద్యార్థులు, నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. 1563 మంది విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులకు సంబంధించి 718, 719 మార్కులకు సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తాయి. 67 మంది విద్యార్థులు ఒకే విధంగా మార్కులు (720 మార్కులు) పొందారు. దీంతో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ పరీక్ష పేపర్ లీక్ అయిందని, దీంతో పరీక్షను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది.