chigurumamidi model school

Model School: ఆదర్శ’ పాఠశాలలో *అవ్వర్లి బేస్డ్’ ఉద్యోగాలు ఆగమాగం

– ఇష్టారీతిన వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్
– ఎదురుచూసిన మండల నిరుద్యోగులకు ఈ సారి కూడా మొండి చేయి

Model School :  కరీంనగర్ జిల్లా  చిగురుమామిడి మండలంలో ఉన్న ఆదర్శ పాఠశాలలో 5 ఎవర్లి బెస్డ్ ఉద్యోగాలు కొన్ని సంవత్సరాలుగా సంవత్సర ప్రాతిపదికన నడుస్తున్నాయి. అయితే పత్రిక ప్రకటన ద్వారా అర్హులైన నిరుద్యోగులను పిలిచి డెమో లు తీసుకొని ఉద్యోగాలలో నియమించుకోవాల్సింది పోయి ప్రిన్సిపాల్ కొన్ని సంవత్సరాలుగా పత్రిక ప్రకటన ఇవ్వకుండా తన ఇష్టారీతిన ఉద్యోగాలు పేరు పలుకుబడి రాజకీయనాయకుల పరిచయస్తులకి కట్టబెడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

సంబంధిత అర్హతతో పాటు టెట్ కూడా కలిగి ఉండాలన్నది నియమం కానీ ఆ నియమాలను ఏం పాటించకుండా బిఎడ్ లేని వారికి సైతం టెట్ అర్హత లేని వారికి సైతం కొంత మందికి పైరవీల ద్వారా ఉద్యోగాలు కల్పించి ఇష్టారీతిన ప్రభుత్వ నియమాలను తుంగలో తొక్కుతున్నారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే స్థానిక మండల స్కూల్ కాబట్టి స్థానికంగా అర్హత కలిగిన నిరుద్యోగులు ఎంతో మంది ఈ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే.. ఈ విషయాన్ని దాచిపెట్టి బయటి మండలాల వాళ్లను.. వేరే జిల్లా వాళ్ళను.. అర్హత లేని వాళ్ళను ఉద్యోగాలలో నియమించుకున్నాడని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని బయటికి రానివ్వకుండా ప్రతి ఏడు గుట్టు చప్పుడు కాకుండా నియామకాలు చేస్తున్నారని.. ప్రిన్సిపాల్ , అంతే కాకుండా కొంత మంది ఉపాధ్యాయులను కారణాలు లేకుండా వ్యక్తిగత అభిప్రాయ భేదాల కారణంగా ఉద్యోగాలనుంది తొలగిస్తున్నారని సమాచారం.
గత 7 సంవత్సరాలలో ఆరుగురు ఉపాధ్యాయులను తొలగించారని.. అందులో ఒకరు హాస్టల్ కేర్ టేకర్ కూడా ఉన్నారని.. విషయం ఏంటి అంటే వీళ్ళు అంతా ఒకే సామాజిక వర్గానికి ( దళిత) చెందిన వాళ్ళు కావడం విశేషం. దీని వల్ల ప్రిన్సిపాల్ దళిత వ్యతిరేకి ల వ్యవహరిస్తున్నారు అని మండల ప్రజలు చర్చించు కుంటున్నారు.. అదే దళితేతరులు అయిన ఉపాధ్యాయులు ఎన్ని తప్పులు చేసిన ప్రిన్సిపాల్ వాటిని బయటికి రానివ్వకుండా కప్పిపుచుతున్నాడు అని సమాచారం. పై అధికారులు స్పందించి మా మండల నిరుద్యోగులకు న్యాయం చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *