- అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వీ నరేందర్ రెడ్డి
Narender Reddy: రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా నిలువడానికి సేవకుడుగా పని చేసేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నానని కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వి.నరేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం కరీంనగర్ జ్యోతిబా పూలే, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మైదానంలో వాకర్స్ తో సమావేశమయ్యారు. రానున్న పట్ట భద్రుల ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు. గత 34 సంవత్సరాలుగా విద్యారంగంలో సేవలు అందిస్తున్నానని, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారు తప్పకుండా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇప్పటివరకు చాలా మంది నాయకులు రాజకీయ భవిష్యత్తు కోసం పనిచేశారని, కాని తాను మాత్రం ఒక సేవకుడిగా పనిచేస్తానని పట్ట భద్రులకు భరోసా ఇచ్చారు. తనను ఆదరిస్తే అండగా ఉంటానని హామీ ఇచ్చారు
-శెనార్తి మీడియా, కరీంనగర్