- అనుమతులు లేకుండానే నిర్మాణాలు?
- ‘మామూలు’గానే తీసుకుంటున్న అధికారులు
- కూలీల మృతితో బయటపడిన లోపాలు
- ఇలాంటివి ఇంకెన్నో..?
శెనార్తి మీడియా, మంచిర్యాల :
Terms are inconsistent: మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. అధికారులు, బిల్డింగ్ నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు కూలీల ప్రాణల మీదకు తెచ్చింది.దీంతో మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కాంపౌండ్ వాల్ కూలిన ఘటనతో పట్టణంలో ఇంకెన్ని ఇలాంటి అనుమతులు నిర్మాణాలు ఉన్నాయో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భవన నిర్మాణ సమయంలో నిబంధనలు విస్మరించడం, జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కూలీల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మంచిర్యాల లోని బెల్లంపల్లి చౌరస్తాలో నందిని హాస్పిటల్ పక్కన కొత్తగా చేపట్టిన భవనం కోసం గోడ నిర్మిస్తున్న క్రమంలో పక్క ఇంటి కాంపౌండ్, మట్టి దిబ్బ కూలి కూలీలపై పడింది. దీంతో కింద పని చేస్తున్న నలుగురు కార్మికులపై మట్టి, గోడ కూలడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు, స్థానికులకు దాదాపు రెండు గంటలరే పైగా సమయం పట్టింది. డ్రిల్లర్, జేసీబీ సాయంతో మృతదేహాలను బయటికి తీశారు. ఘటన జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే రామగుండం సీపీ శ్రీనివాస్, ఏసీపీ ప్రకాశ్ పరిస్థితిని పర్యవేక్షించారు. పట్టణ సీఐ బన్సీలాల్, ఎస్సైలు, కానిస్టేబుళ్లు అతికష్టమ్మీద స్థానికుల సహాయంతో ఒకరి ప్రాణాలను కాపాడగలిగారు.
బయట పడ్డ లోపాలు
ప్రమాదం జరిగిన భవన నిర్మాణంలో లోపాలు బయటపడ్డాయి. అనుమతించిన దాని కంటే లోతు నుంచి నిర్మాణం చేపట్టినట్లుగా తెలుస్తున్నది. నిర్మాణ అనుమతుల నిబంధనల ప్రకారం వ్యాపార సముదాయాలకు 30 మీటర్ల రోడ్డు ఉంటే ముందు వైపు 3మీటర్లు లేదా 5శాతం మొత్తం ప్లాట్ భూభాగంలో ఏది ఎక్కువగా ఉంటే సెట్‌బ్యాక్‌కు కేటాయించాలి. పక్క వైపుల రెండు మీటర్లు లేదా, లేదా ఐదు శాతం ఏది ఎక్కువగా ఉంటే అది సెట్‌బ్యాక్‌గా విడిచి పెట్టాలి. ప్లాట్ పరిమాణాన్ని బట్టి సెట్‌బ్యాక్ నియమాల్లో మార్పులు ఉంటాయి. వంద చదరపు మీటర్లు ఉంటే కనీసం మూడు మీటర్లు, 500చదరపు మీటర్లు ఉంటే ఏడు మీటర్ల వరకు సెట్‌బ్యాక్ విడిచిపెట్టాలి. కమర్షియల్ నిర్మాణాలకు కనీసం 20శాతం, హాస్పిటల్ భవనాలకు పది శాతం పార్కింగ్ కు కేటాయించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో మాత్రం ఇవేమీ కానరావడం లేదు. కనీసం సెంటిమీటర్ స్థలం వదిలేందుకు కూడా నిర్మాణదారులు ఇష్టపడడం లేదు. రాజకీయ ఒత్తిళ్లు, అవినీతి, కొందరు ప్రజాప్రతినిధుల పైరవీల కారణంగా చాలా వరకు నిర్మాణాల్లో నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
జాగ్రత్తలు శూన్యం
వాస్తవానికి ఇంజినీర్లు, ప్లానర్ల పర్యవేక్షణలో కూలీలు పని చేయాలి. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలంగానే ప్రమాదాలు జరుగుతున్నాయి. పని ప్రదేశాల్లో కూలీల తలకు హెల్మెట్లు, చేతులు, కాళ్లకు రక్షణ కవచాలు ఉపయోగించడం లేదు. అనుకోకుండా ఎవరైనా ప్రమాదంలో మృతిచెందితే బాధితులకు పరిహారం ఇచ్చి సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నారు. అయితే ఇదంతా మేస్ర్తీలే చూసుకుంటున్నారు. భవన నిర్మాణ కార్మికులు, అడ్డా కూలీలు అధికంగా వలస వచ్చిన వారే కావడంతో వారిని పట్టించుకునే వారు కరువయ్యారు. రోజువారీగా పనుల కోసం వచ్చే వారికి భద్రత ఉండడం లేదని కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి.
అవినీతి మత్తులో టౌన్ ప్లానింగ్
మున్సిపాలిటీల్లో టౌన్ ప్లానింగ్ వ్యవస్థ అవినీతి మత్తులో కూరుకుపోయిందనే విమర్శలు ఉన్నాయి. మూముళ్లు ముడితే ఆ నిర్మాణాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తాము అడిగినంత ముడితే చాలు ఎలాంటి అనుమతులు లేకున్నా, నిబంధనలు పాటించకున్నా నిర్మాణాలు సాగిపోతుంటాయి. ఒకవేళ అన్ని సక్రమంగా ఉన్నా మామూళ్లు ముట్టజెప్పకుంటే ఏదో కొర్రీ పెట్టి భవన నిర్మాణదారులను బెదిరింపులకు గురి చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు ఉండగా, ఒక్క చోట రెగ్యులర్ టౌన్ ప్లానింగ్ అధికారి లేడు. అంతటా ఇన్చార్జీలతో నెట్టుకొస్తున్నారు. దీంతో కింది స్థాయి సిబ్బందికి కాసుల వర్షం కురుస్తుంది. జిల్లా కేంద్రమైన మంచిర్యాల మున్సిపాలిటీలో టౌన్‌ప్లానింగ్ అధికారి డిప్యూటేషన్‌పై వెళ్లగా, మరో ఇద్దరు టీపీఎస్‌లు పని చేస్తున్నారు. వీరిద్దరికి నస్పూర్, బెల్లంపల్లి మున్సిపాలిటీల అదనపు బాధ్యతలు అప్పగించారు. సిబ్బంది కొరత కూడా పర్యవేక్షణకు వీలులేకుండా పోతున్నది. ముగ్గురు మృతి ఘటనపై మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ మారుతిప్రసాద్‌ను ఫోన్ లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా, ఆయన కాల్ రిసీవ్ చేసుకోలేదు. తీసుకుంటామన్నారు.