- నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు
- 20 మంది కార్మికులను విధులకు తీసుకోవాలి
శెనార్తి మీడియా, మంచిర్యాల :
Naspur: మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య(Sanitation) కార్మికులు నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో మంగళవారం ఉదయం విధులను బహిస్కరించి నిరూసన చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… గత నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో తమకు కుటుంబ పోషన భారంగా మారిందని కార్మికులు వాపోయారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య ధోరణిని వారు తప్పుబట్టారు. మున్సిపాలిటీలో అతి తక్కువ జీతంతో పట్టణ పారిశుద్ధ్య పనులను చేస్తున్న తమపై ఇలా నిర్లక్ష్యధోరణి అవలంబించడం సరైంది కాదని, వెంటనే తమకు రావాల్సిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐలను ఖాతాల్లో జమ చేయడం లేదన్నారు. వేతనాలు సక్రమంగా ఇవ్వకపోగా అకారణంగా 20 మంది కార్మికులను తొలగించాలనే కుట్రకు అధికారులు పాల్పడ్డారన్నారు. రెండు మూడు ఏళ్ల నుంచి పనిచేస్తున్న 20 మంది కార్మికులను తొలగించి మళ్లీ కొత్త వారిని తీసుకోవాలని ఆలోచనలో అధికారులు ఉన్నట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు. వెంటనే పక్కాకు పెట్టిన 20 మంది కార్మికులను విధులకు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
-సక్రమంగా విధులు నిర్వహించని కొంతమంది కార్మికులను పక్కకుపెట్టాం
– చిట్యాల సతీష్,కమిషనర్ నస్పూర్ మున్సిపాలిటీ
విషయాన్ని తెలుసుకున్న కమిషనర్ చిట్యాల సతీష్ కార్మికులతో సమావేశమై మాట్లాడారు. సమస్యలను త్వరగానే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు మధ్యాహ్నం ఆందోళన విరమించి విధులకు వెళ్లారు సక్రమంగా విధులు నిర్వహించని కొంతమంది కార్మికులను గుర్తించి పక్కన పెట్టామన్నారు. వారిని మళ్లీ తీసుకునే ఆలోచనను పరిశీలిస్తున్నామన్నారు. కార్మికుల సహకరించి పట్టణ పరిశుభ్రతకు సహకరించాలని సూచించారు.