Dharani
Dharani

Dharani: ధరణి అప్లికేషన్లు తీసుకోవద్దు.. పెద్ద సారు ఆదేశాలు

Dharani:  మంచిర్యాల జిల్లాలో ధరణిలో కొత్త అప్లికేషన్లను తీసుకోవద్దంటూ ఓ పెద్ద సారు ఆదేశాలు జారీ చేశారు.  దీనికి సాంకేతిక కారణం ఏదీ లేదు. కేవలం అధికారుల ఆదేశాలతో మీ కొత్త అప్లికేషన్లు తీసుకోవద్దంటూ అదేశాలు జారీ అయ్యాయి. దీంతో  మీ సేవ కేంద్రాల్లో ధరణి కొత్త దరఖాస్తులు తీసుకోవడం లేదు. కేవలం భూముల క్రయవిక్రయాలకు సంబంధించి అప్లికేషన్లు మాత్రమే తీసుకుంటున్నారు. గతంలో జరిగిన పొరపాట్లు, పేర్ల మార్పు, ఇతర కరెక్షన్లకు సంబంధించి ఎటువంటి అప్లికేషన్లు తీసుకోవద్దని మీ సేవా నిర్వాహకులకు అంతర్గతంగా అదేశాలు జారీ అయ్యాయని సమాచారం.  మంచిర్యాల జిల్లా  కలెక్టరేట్ నుంచి ఓ పెద్ద సారు మీ సేవ నిర్వాహకులకు ఇంటర్నల్ గా మెసేజ్ చేశారు. ఇవి ఉన్నతాధికారుల ఆదేశాలని, విస్మరిస్తే మీ సేవా కేంద్రాలను సీజ్ చేస్తామని ఇంటర్నల్ గా హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలియని పలువురు మీ సేవా కేంద్రాల వద్ద వివిధ అప్లికేషన్ల కోసం కోసం పడిగాపుల కాస్తున్నారు. మీ సేవా నిర్వాహకులు ఈ విషయాలేమి చెప్పడం లేదు. సర్వర్ డౌన్ ఉందంటూ వారిని పంపించేస్తున్నారు.

అప్లికేషన్లను తక్కువగా చూపించేందుకా..లేక మరో కారణమా?
రాష్ర్టమంతా ధరణి లో స్లాట్ బుకింగ్స్ సాగుతున్నా మంచిర్యాల జిల్లాలో మాత్రం చేయడం లేదు. దీని అంతరార్థం ఏమిటో అర్థం కావడం లేదు. అయితే ధరణి స్లాట్ బుకింగ్ పెండింగ్ అప్లికేషన్లు తక్కువగా చూపించేందుకు మీ సేవ నిర్వాహకులకు ఇలా ఇంటర్నల్ మెసేజ్ చేశారని కొందరి వాదన. సీఎం రేవంత్ రెడ్డి ముందునుంచి చెబుతున్నట్లుగా ధరణి ని ప్రక్షాళన చేసే వ్యూహంలో భాగంగా ఒక్కో జిల్లా నుంచి ఇలా స్లాట్ బుకింగ్ లను తగ్గించేందుకు చేస్తున్న ఎత్తుగడ అని మరికొందరి వాదన. మరి మంచిర్యాల జిల్లాలో స్లాట్ బుకింగ్స్ నిలిపివేయడానికి కారణాలేంటో పెద్ద సారుకే తెలియాలి.

-శెనార్తి మీడియా, మంచిర్యాల

 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *