శెనార్తి మీడియా, రాజన్న సిరిసిల్ల:-
ACB: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణాకాశీ గా పేరు గాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆలయంలోని అన్నదాన సత్రం, ధర్మశాలలు, లడ్డు తయారీ, అమ్మకం, గోదాం, అడిట్ తదితర విభాగాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆలయంలోని పలు రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఏసీబీ సోదాల నేపథ్యంలో ఆలయ అధికారుల్లో ఒక్కసారిగా కలవరం మొదలైంది. గతంలో కూడా పలుమార్లు సోదాలు జరిగాయి.