Modi in g7 summit

G7 Summit : జీ7 సమ్మి‌ట్‌తో భాతర ఆర్థిక వ్యవస్థకు లాభమేనా?

G7 Summit : భారతదేశం ఇప్పుడు ప్రపంచానికి ఇరుసుగా మారుతున్నది. ప్రపంచ నాయకులతో ప్రధాని నరేంద్ర మోడీ మధ్యలో నిలబడి ఉన్న చిత్రం ద్వారా ఇది నిరూపితమవుతున్నది. ఇటలీలో జీ7 శిఖరాగ్ర సమావేశానికి భారతదేశాన్ని ‘ఔట్రీచ్ నేషన్’గా ఆహ్వానించారు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ పలువురు ప్రపంచ నేతలతో సమావేశమయ్యారు. అంతిమంగా దీని వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు కలిగే ప్రయోజనం ఏమిటి?

G7-summit

జీ7 సదస్సులో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ భారత్ కు చేరుకున్నారు. జీ7 ‘అవుట్‌రీచ్ సెషన్’లో, ప్రధాని నరేంద్ర మోడీ సాంకేతికతపై గుత్తాధిపత్యాన్ని అత్యంత బలంగా లేవనెత్తారు. దీనితో పాటు, భారతదేశంలో ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలు, వాటిలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగం, ఈ యంత్రాల సాంకేతిక పారదర్శకత, నిష్పాక్షికతను కూడా ఆయన ప్రస్తావించారు.

ప్రపంచ నేతలతో ప్రధాని సమావేశం

ఇటలీలో ప్రధాని జార్జియా మెలోనితో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనేక ఇతర ప్రపంచ నాయకులను కూడా కలిశారు. బ్రిటీష్ ప్రధాని రిషి సునక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాలతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపారు.

అంతేకాంకుడా జీ7 సమ్మిట్ సందర్భంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సిల్వా యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌లతో ప్రధాని సమావేశానికి సంబంధించిన చిత్రాలు బయటకువచ్చాయి. ఇది జీ7 శిఖరాగ్ర సమావేశంలో భారతదేశం తన బలమైన ఉనికిని చాటిచెప్పింది

దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం
ప్రపంచ నేతలతో సమావేశం, ఔట్రీచ్ కాన్ఫరెన్స్ సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా చూపించే పలు అంశాలపై చర్చించారు. చైనాతో పెరుగుతున్న టెన్షన్‌పై జీ7 దేశాల నేతలు చర్చించగా.. చైనా కంటే పెట్టుబడులకు తమనే మంచి ఆప్షన్‌గా ప్రపంచానికి చూపించాలన్నది భారత్‌ ప్రయత్నం.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ప్రధాని నరేంద్ర మోదీ రక్షణ, అణు, అంతరిక్షం, విద్య, వాతావరణ మార్పు, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, క్లిష్టమైన సాంకేతికతలు, కనెక్టివిటీ, సంస్కృతి వంటి అంశాల్లో పరస్పర సహకారంపై మాట్లాడారు.

G7-Summit-modi-justin
G7-Summit-modi

బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌తో ప్రధాని మోదీ భారత్-యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. అక్కడి ఎన్నికల తర్వాత భారత్, బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం త్వరలో పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు సాంకేతికత, సెమీ కండక్టర్లు, వాణిజ్యంపై సహకారాన్ని పెంచుకునేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ ‌స్కీతో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చలు జరిగాయి. అదే సమయంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో, ప్రధాని మోదీ రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చించారు.

‘గ్లోబల్ సౌత్’లో అగ్రగామిగా భారత్

ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో భారతదేశాన్ని ‘గ్లోబల్ సౌత్’ అగ్రగామిగా అభివర్ణించారు. దీనితో పాటు, ఏఐ, డిజిటలైజేషన్‌కు సంబంధించి భారతదేశ కార్యక్రమాలపై ప్రపంచానికి తెలియజేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా భారత్ చేస్తున్న ఈ ప్రయత్నాలను అభినందించారు. పోప్ ఫ్రాన్సిస్ ప్రసంగం మొత్తం ఏఐ ప్రయోజనాలు, అప్రయోజనాలపై దృష్టి పెట్టింది.

ప్రపంచం ముందు టెక్నాలజీ ప్రజాస్వామ్యీకరణపై ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రపంచం సాంకేతికతపై గుత్తాధిపత్యానికి స్వస్తి పలకాలని, మానవాళి అభ్యున్నతికి పెద్ద ఎత్తున వినియోగించాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *