Ajith Dhoval Thumbnail

Ajith Doval: హిడెన్ హంటర్.. ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్

Ajith Doval: ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరోసారి దేశ జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్‌ను నియమించింది. అతను మే 30, 2014 నుంచి ఈ పదవిలో ఉన్నారు. ఎన్ ఎస్ ఏగా నియమితలవడం ఇది మూడోసారి. ప్రధాని మోడీకి దోవల్ ఎంత నమ్మకస్తుడో తన నియామకమే ఉదాహరణ. ఇండియన్ ‘జేమ్స్ బాండ్’గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.

అజిత్ దోవల్ జమ్మూ కాశ్మీర్‌తో పాటు మిజోరాం, పంజాబ్‌లలో అనేక ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు చేపట్టారు. దోవల్ కెరీర్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 2014లో నరేంద్ర మోదీ తొలిసారిగా దేశ ప్రధానమంత్రి కాగానే అజిత్ దోవల్ పై దృష్టి పెట్టారు. ఉగ్రవాదంపై దోవల్‌కు ఉన్న అనుభవం, దౌత్యపరమైన నిర్ణయాలు తీసుకోవడం, జాతీయవాద భావజాలంపై ఆయనకున్న అవగాహనను పరిగణనలోకి తీసుకుని కీలకమైన ఎన్‌ఎస్‌ఏ (జాతీయ భద్రతా సలహాదారు) ముఖ్యమైన బాధ్యతలు అప్పగించారు. .

జమ్మూ కాశ్మీర్‌లో భద్రత సవాల్

మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మొదటి విడుతలో ఆయన అనేక ఆపరేష్లన్లు విజయవంతంగా నిర్వహించారు. అమెరికా, రష్యాలతో సమతూకం పాటించే విధానంలో అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించారన్నారు. మోదీ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలల తర్వాత, 2019లో, ఆర్టికల్ 370ని జమ్మూ కాశ్మీర్‌లో 5 ఆగస్టు 2019న తొలగించారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక చర్యను అమలు చేయాలనే ప్రణాళిక ఒక్క రోజు కోసం కాదు. దీనికి సంబంధించిన తెర వెనుక పనులు చాలా కాలం సాగాయి. జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రవాదం, ఆర్టికల్ 370ని తొలగించడానికి ముందు ప్రభుత్వం ముందు అనేక చిక్కుముళ్లు ఉన్నాయి. ఇందులో అతిపెద్ద సమస్య జమ్మూ కాశ్మీర్‌ భద్రతా వ్యవస్థ. అక్కడి వేర్పాటువాద భావజాలాన్ని అధిగమించడం అంత సులువు కూడా కాదు. ఆర్టికల్ 370 రద్దుకు ముందు జమ్మూ కాశ్మీర్ మాజీ సిఎం మెహబూబా ముఫ్తీ, లోయలోని ఇతర నాయకులు ఆర్టికల్ 370ని తాకితే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నేరుగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఒకవైపు భద్రత సమస్య, మరోవైపు హెచ్చరికలు వచ్చాయి.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత దోవల్ కాశ్మీర్ కు

ఆర్టికల్ 370 రద్దును 5 ఆగస్టు 2019న ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ వీధుల్లో నిశ్శబ్దం మధ్య ఆగస్టు 7న అజిత్ దోవల్ స్వయంగా జమ్మూ కాశ్మీర్ చేరుకున్నారు. భద్రతా ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. కాశ్మీర్ వీధుల్లో తిరిగాడు. అలాగే రోడ్డుపక్కన ఉన్న వారితో కలిసి భోజనం చేశారు. తెరవెనుక పనిచేసే దోవల్.. ఈసారి ముందుకు వచ్చి ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతను చాలా చక్కగా నిర్వర్తించారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించడం ఇదే మొదటిసారి కాదు. దీనికి ముందు ఆపరేషన్ బ్లూ స్టార్‌లో కీలక పాత్ర పోషించాడు. దోవల్ వ్యూహానికి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కూడా అభిమాని.

ఆపరేషన్ బ్లూ స్టార్‌లో దోవల్ పాత్ర

ఈ సంఘటన 1984 సంవత్సరంలో జరిగింది. ఆపరేషన్ బ్లూ స్టార్ జూన్ 3 నుంచి 6 వరకు కొనసాగింది. ఖలిస్తాన్ మద్దతుదారు జనరల్ సింగ్ భింద్రన్‌వాలే, అతని మద్దతుదారులు అమృత్‌సర్‌లోని హరిమందిర్ సాహిబ్ కాంప్లెక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాన్ని విడిపించేందుకు ఆపరేషన్ బ్లూ స్టార్‌ను ప్రారంభించారు. పాక్ గూఢచారిగా వెళ్లిన దోవల్ ఆ దేశ సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించారు.

ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో కీలకపాత్ర పోషించిన దోవల్ కుకా పారే అలియాస్ మహ్మద్ యూసుఫ్ పారేని ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చిన ఘనత కూడా దక్కింది. కుకా పరే భారత వ్యతిరేక కాశ్మీరీ తీవ్రవాది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరంలో ఉన్న కుకా పారే 250 మంది ఉగ్రవాదులను వెంట తీసుకెళ్లి పాకిస్థాన్‌పై తిరగబడ్డాడని దోవల్ గేమ్ ఆడాడు. కుకా పారే తిరిగి ప్రధాన స్రవంతిలోకి వచ్చి జమ్మూ కాశ్మీర్ అవామీ లీగ్ పార్టీని స్థాపించారు. అంతేకాదు ఒకప్పుడు ఎమ్మెల్యే కూడా.

రొమేనియన్ దౌత్యవేత్తను కాపాడిన దోవల్

ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ 1991లో రోమేనియన్ దౌత్యవేత్త లివియు రాడును కిడ్నాప్ చేసింది. ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ బారి నుంచి దౌత్యవేతను సురక్షితంగా రక్షించేందుకు దోవల్ పథకం వేశారు. పీఓకేలోకి ప్రవేశించి, ఉగ్రవాదులతో పాటు వారి స్థావరాలను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించారు. సర్జికల్ స్ట్రైక్‌లో కూడా కీలక పాత్ర పోషించాడు.

 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *