శెనార్తి మీడియా, మంచిర్యాల:
Singareni: జిల్లాలోని శ్రీరాంపూర్ ఉపరితల గనిని ఆలిండియా మైన్స్ సేఫ్టీ అవార్డు కమిటీ తనిఖీ బృందం గురు వారం సందర్శించింది. సింగరేణి వ్యాప్తంగా నాలుగు గనులను ఆలిండియా మైన్స్ సేఫ్టీ అవార్డుకు ఎంపిక చేయగా, సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఓసీలలో శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ ఓసీ ఎంపిక కాగా బృందం తనిఖీ నిర్వహించింది. బృందానికి ఓసీలో పని చేస్తున్న ఇంజనీర్లు భారీ యంత్రాలతో వినియోగించే ఆటోమెటిక్ ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టం పని తీరును, ఎప్లియంట్ ట్రీట్మెంట్ ప్లాంటు పని విధానాన్ని వివరించారు. అలాగే మహిళా ఉద్యోగులు సీపీఆర్ను కమిటీ సభ్యులకు కూలంకుశంగా వివరించి, సీపీఆర్ విదానాన్ని కమిటీ సభ్యుల ముందు ప్రదర్శించారు. ఓసీలో తీసుకుంటున్న రక్షణ పద్ధతులను, క్వారీలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ప్రదేశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. అనంతరం గనిపై బృంద సభ్యులు మొక్కలు నాటారు. గనిని సందర్శించిన బృందంలో కమిటీ చైర్మన్ బీ వెంకన్న(డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ, మైనింగ్ సౌత్ సెంట్రల్ జోన్ హైదరాబాద్,) కమిటీ సభ్యులు అనురాగ్ శేఖర్ దూబే (జీఎం వెస్ట్రన్ కోల్ లిమిటెడ్), రవీంద్ర పీ గత్వార్ (జీఎం హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్), మనోరంజన్ మహలి (జీఎం యూరేనియం కార్పొరషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్), సురేష్ మూర్తి (జీఎం నైవేలి), డాక్టర్ రితేష్ (వెస్ట్రన్ కోల్డ్ లిమిటెడ్), ఏరియా ఇంఛార్జీ -జనరల్ మేనేజర్ ఎం శ్రీనివాస్లతో పాటు ఓసీపీ పీఓ శ్రీనివాస్, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, అఫెక్స్ కమిటీ సభ్యులు ఏవీ రెడ్డి, మేనేజర్ బ్రహ్మాజీ, ప్రాజెక్టు ఇంజనీర్ చంద్రశేఖర్, రక్షణాధికారి శ్రీనివాస్, సంక్షేమాధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.