Healthy Chat For Weight Loss : మార్కెట్‌లో లభించే చాట్ తినడం ద్వారా బరువు తగ్గడాన్ని అడ్డుకుంటుంది. ఇక్కడ పేర్కొన్న కొన్ని రుచికరమైన వంటకాలను ఇంట్లోనే తయారు చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు చిరు తిళ్లను ఆస్వాదించవచ్చు. ఇవి బరువును అదుపులో ఉంచుతుంది. జిహ్వకు మంచి రుచిని కూడా అందిస్తుంది.
అసంబద్దమైన ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చాలా మంది ఉబకాయం బారిన పడుతున్నారు. అదే బరువు పెరగడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా మంది ప్రజలు ఇప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తున్నారు. ఇందుకోసం కొందరు యోగా, వ్యాయామాలు చేస్తుంటే, మరికొంత మంది జిమ్‌కి వెళ్లి గంటల తరబడి వర్కవుట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఫిట్‌గా ఉండే మార్గంలో అడుగు పెట్టకముందే ఇష్టమైన వాటిని వదులుకోవాలి. భారతీయులు చాలా తెలివైన వాళ్లని మనందరికీ తెలుసు. అందుకే చాలా మంది ఫిట్‌గా ఉండడంతో పాటు జిహ్వ చాపల్యాన్ని చంపుకోవడానికి ఇష్టపడరు. బయటికి వెళ్లి చూస్తే చాట్-పకోడీలు, నోరూరిస్తుంటాయి. అయితే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని చాట్స్ ఆరోగ్యకరంగా ఉన్నాయి. వీటి సహాయంతో మీరు చాట్‌ను ఆస్వాదించవచ్చు. ఈ వంటకాలతో బరువు తగ్గడం కూడా చాలా సులభం.
మార్కెట్‌లో లభించే చాట్ తినడం వల్ల మీ బరువు తగ్గించుకోవచ్చు. ఇక్కడ పేర్కొన్న కొన్ని రుచికరమైన వంటకాలను మీరు ఇంట్లోనే తయారు చేసుకోవడం ద్వారా ఆనందించవచ్చు. ఇది మీ బరువును అదుపులో ఉంచుతుంది. రుచిలో ఎటువంటి మార్పు ఉండదు. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని ఆరోగ్యకరమైన చాట్ ల గురించి తెలుసుకుందాం.
పచ్చి మామిడికాయ చాట్
వేసవి కాలంలో పచ్చి మామిడికాయ చాట్ తినడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. దీన్ని చేయడానికి, ఉల్లిపాయ, టమాట, క్యారెట్, ఉడికించిన శెనగలు, కొత్తిమీర, పచ్చిమిర్చి తీసుకోవాలి. వీటన్నింటిని సన్నగా తరిగి ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. వీటన్నింటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల బరువు తగ్గడం చాలా సులభం అవుతుంది.
ఫ్రూట్ చాట్
మీరు సీజనల్ పండ్లను ఉపయోగించి ఇంట్లోనే ఫ్రూట్ చాట్ తయారు చేసుకోవచ్చు. దీని కోసం ఇష్టమైన పండ్లు లేదా సీజన్ ప్రకారం లభించే పండ్లను ఉపయోగించవచ్చు. అన్ని పండ్లను చిన్న ముక్కలుగా కట్ చేసి, దానికి చాట్ మసాలా వేసి తినడమే. మసాలా దినుసులు జోడించిన తర్వాత, ఎక్కువసేపు ఉంచకూడదని విషయాన్ని గుర్తుంచుకోవాలి. లేకపోతే, పండ్లలోని పోషకాలు మొత్తంనీటి ద్వారా బయటకె వెళ్తాయి.
మొలకల చాట్
సాయంత్రం తేలికపాటి భోజనం కోసం మొలకల చాట్ చేసుకోవచ్చు. దీని కోసం మొలకెత్తిన గింజలను తీసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ, టమాట, స్వీట్ కార్న్, పచ్చిమిర్చి, బ్లాక్ పౌడర్, ఉప్పు వాడతారు. ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి సన్నగా తరిగి స్వీట్ కార్న్ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని కలిపి టేస్టీ స్ప్రౌట్స్ చాట్ తయారు చేసుకోవచ్చు.