CNAP Service: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అమాయకులను టార్గెట్ చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న విషయం తెలసిందే. వీటిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజినీ డెవలప్ చేసింది. దీనికి సంబంధించి ట్రయల్ రన్ కూడా మొదలు పెట్టింది.
మోసపూరిత కాల్స్ ను నిరోధించడానికి ప్రభుత్వం కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP) అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ది చేసింది. ఇందుకు సంబంధించిన ట్రయల్‌ను ప్రారంభించింది. ఇది మోసపూరిత కాల్స్ చేసే వ్యక్తులను గుర్తించడంలో సహాయపడుతుంది.
టెలికాం కంపెనీలు ముంబై, హర్యానాలో ఈ సేవల ట్రయల్ ను ప్రారంభించాయి. ఈ సేవ త్వరలో దేశమంతటా అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు. ఈ సేవ ట్రూ కాలర్ (True caller) లాగా పని చేస్తుంది. కాల్ చేసే వినియోగదారు పేరు కనిపిస్తుంది. ఇది ప్రభుత్వ సేవ అయినప్పటికీ, ఇందులో కాలర్ అసలు పేరు కనిపిస్తుంది,. కాలర్ సిమ్‌ని కొనుగోలు చేసిన సమయంలో ఇచ్చిన ఐడీ ప్రకారం వివరాలు కనిపిస్తాయి. అయితే ఇది ట్రూ కాలర్ (Truecaller) ఇది అందుబాటులో జరగదు.
మోసపూరిత కాల్స్ నుంచి ఉపశమనం
ఈ సేవను అమలు చేయడానికి ప్రభుత్వం టెలికాం ఆపరేటర్లపై కొంత కాలం నుంచి ఒత్తిడి తెస్తున్నది. దీంతో మోసపూరిత కాల్‌ల సమస్యను పరిష్కరించవచ్చు. ఇది అంతర్జాతీయ నకిలీ కాల్స్ ని నిరోధించడంలో కూడా సహాయపడుతుంది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వస్తున్న తెలియని మెసేజ్‌లు, కాల్స్ తో ప్రజలు మోసాలకు గురవుతున్నారు. వీటిపై సైబర్ సెల్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రుణం, క్రెడిట్ కార్డ్ లేదా సిమ్ కార్డ్ KYC పేరుతో మొబైల్ వినియోగదారులను దోచుకుంటున్నారు. బ్యాంకింగ్, ప్రమోషనల్ కాల్స్ ను గుర్తించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కొత్త నంబర్ సిరీస్‌ను కూడా ప్రారంభించడానికి సిద్ధమవుతున్నది. ఇది కొత్త సిరీస్ తో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రమోషనల్ , బ్యాంకింగ్ కాల్స్ సులభంగా గుర్తించవచ్చు.
దేశవ్యాప్తంగా సీఎన్ఏపీ (CNAP) సేవలు
దేశవ్యాప్తంగా సీఎన్ఏపీ (CNAP) సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత, థర్డ్ పార్టీ యాప్ అవసరం ఉండదు. వాస్తవానికి, పేరును ప్రదర్శించే థర్డ్ పార్టీ యాప్ లు మొబైల్ డేటాను చోరీ చేస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో వినియోగదారుడి గోప్యతకు ముప్పు వాటిల్లుతుంది. సీఎన్ఏపీ (CNAP) సేవలు అందుబాటులోకి వస్తే ఎన్నో సమస్యలకు చెక్ పడనుంది.