- పట్టభద్రులకు బాసటగా నిలుస్తా
- ఎమ్మెల్సీగా గెలిస్తే వచ్చే ప్రతి పైసా నిరుపేదల కోసం ఖర్చు చేస్తా
- స్టడీ సెంటర్లు, గ్రంధాలయాలు ఏర్పాటు చేసి ఉన్నతమైన విద్యను అందిస్తా
- ప్రైవేటు ఉద్యోగుల కు హెల్త్ కార్డుల జారీకి కృషి చేస్తానని వెల్లడి
- పట్టబద్రుల సభ్యత్వ నమోదు అవగాహన సదస్సులో డాక్టర్ వీ. నరేందర్ రెడ్డి
Alphores :పట్టభద్రులకు బాసటగా నిలవాలని సంకల్పంతో రానున్న కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలో పలు ప్రైవేటు ,ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలోతో పాటు బార్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి పట్టభద్రుల ఓట్ల నమోదుపై అవగాహన కల్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ విద్యారంగంలో గత 34 సంవత్సరాల నుండి క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అందిస్తు తెలంగాణ విద్యారంగంలో అగ్రగామిగా నిలిచానని, ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడంతోపాటు తన సంస్థలో వేలమంది ఉపాధ్యాయులకు ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్నారని వెల్లడించారు. ఆంధ్ర కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఐఐటీ , నీట్ లో అద్భుత ఫలితాలు సాధించారని గుర్తు చేశారు. కొన్ని లక్షల మంది విద్యార్థులను ఇంజనీర్లుగా డాక్టర్లుగా భావి భారత పౌరులుగా తన సంస్థ తీర్చిదిద్దని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులు డాక్టర్లు ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని వారి సమస్యలకు విద్యావంతుడైన తనను రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో గెలిపిస్తే ఉద్యోగ నిరుద్యోగ పట్టభద్రుల సమస్యలపై నిరంతరం చిత్తశుద్ధి తో పోరాడుతానని వెల్లడించారు.
ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక చాలా ఇబ్బందుల్లో ఉన్నారని ,ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల ప్రధాన సమస్య అయిన హెల్త్ కార్డుల జారీ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని వెల్లడించారు. విద్యారంగంలో తెలంగాణ పురుగు రాష్ట్రాల కంటే వెనుకబడి ఉందని నూతన విద్యా విధానం తీసుకురావాలని దానికోసం కృషి చేస్తానని వెల్లడించారు. ఎమ్మెల్సీగా గెలిస్తే వచ్చే ప్రతి పైసలు నపేద విద్యార్థులు నిరుద్యోగుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసి వారి కోసమే వెచ్చిస్తానని వెల్లడించారు. ప్రతి మండలంలో లైబ్రరీలు స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయించి నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తానని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో 11 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ ఆదర్శ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీలతో పాటు చాలా పాఠశాలల్లో ఎంఈఓ డిఈఓ లను నియమించాలని గుర్తు చేశారు.
శెనార్తి మీడియా, కరీంనగర్