- సమగ్ర కుల గణన చేపట్టాలి
- బీసీలపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు..
- బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డీ రాజారాం యాదవ్
- ఆదిలాబాద్ ఎన్టీఆర్ చౌక్ లో బీసీల సత్యాగ్రహ దీక్ష
BC Sathyagraha Deeksha: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే దాకా పోరాడుతామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డీ రాజారాం యాదవ్ స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌక్ వద్ద గల ఆర్అండ్ బీ ముందు బీసీ జనసభ(BC Janasabha), బీసీ కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం బీసీల సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. దీక్ష శిబిరాన్ని రాజారాం యాదవ్ సందర్శించి, సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని నినాదాలు చేశారు. సమగ్ర కుల జనగణన,స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదని మండిపడ్డారు.సీఎం రేవంత్ రెడ్డి తన సామాజిక వర్గానికే పదవులు పంపకాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి బీసీల ఓట్లు కావాలి..పదవులు మాత్రం వద్దా..? అని ప్రశ్నించారు.బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకే సీఎం చూస్తున్నారని అన్నారు.
కార్యక్రమంలో డాక్టర్ రవికిరణ్ యాదవ్, బీసీ సంఘాల నాయకులు మేకల కృష్ణ, అవ్వారు వేణు కుమార్, గంజెంద్, కాశవేణి నారాయణ, హన్మాండ్లు యాదవ్, ఈర్ల సత్యనారాయణ, పార్థసారథి,అన్నదానం జగదీష్, రఘువీర్ యాదవ్, రవికాంత్, వేణు యాదవ్ పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, ఆదిలాబాద్