మహిళా సాధికారత కేంద్రం జిల్లా సమన్వయ అధికారి సౌజన్య
Women Empowerment : ఆడపిల్లల రక్షణ మనందరి బాధ్యత అని మహిళా సాధికారత కేంద్రం జిల్లా సమన్వయ అధికారి సౌజన్య అన్నారు. మంగళవారం భరోసా కేంద్రం ఆవరణలో భేటి బచావో భేటి పడావో వారోత్సవాల్లో భాగంగా ప్లాంటేషన్ డ్రైవ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడారు. భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలను వివరించారు. సమాజంలో బాలికల పట్ల వివక్షత చూపవద్దన్నారు. పీసీపీఎన్‌డీటీ యాక్ట్ గురించి వివరించారు. లింగ నిర్ధారణ నేరమని, కుటుంబంలో బాలికలను పురుషులతో సమానంగా చూడాలని సూచించారు. కార్యక్రమంలో మహిళా సాధికారత కేంద్రం స్టాఫ్, షీటీం ఎస్ ఐ హైమ, ఐసీడీఎస్ సూపర్ వైజర్ చందన, సఖీ కేంద్రం అడ్మినిస్ట్రేటర్ శ్రీలత, భరోసా కేంద్రం కోఆర్డినేటర్ విజయ, సిబ్బంది, అంగన్ వాడీ టీచర్, మహిళలు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల