India vs Pak : అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం. ఆ క్షణం ఇప్పుడు రానే వచ్చింది. మరోసారి దాయాది జట్లు అంతర్జాతీయ వేదికపై తలపడబోతున్నాయి. ఆ రెండు జట్ల మరేవో కాదు.. ఇండియా, పాకిస్తాన్. జూన్ 9న టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పోరు జరగనుంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియం ఈ మ్యా్చ్ కు వేదిక కానుంది. పాకిస్థాన్ పై భారత్ విజయం సాధిస్తే తమ గ్రూప్‌లో అగ్రస్థానానికి చేరుకుంటుంది.ఈ మ్యాచ్ లో పాక్ ఓడితే వెంటనే టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ దాదాపుగా నిష్క్రమిస్తుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ఇరు జట్లు తమ సర్వశక్తులు ఒడ్డుతాయి.
టీమిండియా బలమేంటి?
రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా జట్టు ప్రధాన బలం బ్యాటింగ్. రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే వంటి పవర్ హిట్టర్లు ఉన్నారు. అంతేకాకుండా, టీ20లో ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడు. సూర్య కుమార్ ఒక్కసారి ఫామ్ లోకి వస్తే అతడి ఎవరూ ఆపలేరు. యువకులతో పాటు రోహిత్, విరాట్‌లకు అపారమైన అనుభవం కూడా ఉంది. న్యూయార్క్‌లోని అసమాన బౌన్స్ పిచ్‌పై జస్ప్రీత్ బుమ్రా మరింతగా రాణించగలడు.
పాకిస్తాన్ బలం అతడే..
పాక్ జట్టులో బలమైన అంశం కెప్టెన్ బాబర్ ఆజం. అతను జట్టుకు ఇరుసులాంటి వాడు. అవతలి ఎండ్ నుండి మహ్మద్ రిజ్వాన్ మద్దతు లభిస్తే, ఈ జోడి మరింత రాణిస్తుంది. పాకిస్థాన్ జట్టులో షాహీన్ షా అఫ్రిదితో పాటు మహ్మద్ అమీర్ రూపంలో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు ఉన్నారు. ఇది అమెరికా పిచ్ లపై అంతగా పని చేయకపోవచ్చు, కానీ వారి ఇన్‌బౌండ్ బంతి రోహిత్‌తో సహా చాలా మంది భారతీయ బ్యాట్స్‌మెన్‌లకు సమస్య కానుంది.
ఈ మ్యాచ్‌లో ఇరు జట్లలో
టీమీండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
పాకిస్థాన్: బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఆజం ఖాన్ (వికెట్ కీపర్), ఇఫ్తీకర్ అహ్మద్, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్.