Ravindra Jadeja: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను ఓడించి టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీలో టీమిండియా కేవలం 119 పరుగులకే ఆలౌటైనా పాకిస్థాన్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంత చిన్న స్కోరు నుంచి బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా తదితరులు భారత్ ను గట్టెక్కించారు. టీమ్ ఇండియా విజయానికి బౌలర్లందరూ కారకులయ్యారు. ఈ పిచ్‌పై రిషబ్ పంత్ మినహా టీమిండియా బ్యాట్స్‌మెన్లు విఫలమయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ వంటి దిగ్గజ బ్యాట్స్‌మెన్ల వైఫల్యం పై ఇప్పుడు చర్చ జరగుతున్నది. అయితే ఇందులో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వైఫల్యం కూడా ఉంది.
న్యూయార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పిచ్ బ్యాటింగ్‌కు ఏమాత్రం సులువుగా ఉండదని మొదటి నుంచీ తెలుసు. పైగా, వర్షం కారణంగా మారిన పరిస్థితుల్లో మొదట బ్యాటింగ్ క్లి్ష్టమే. ఈ పరిస్థితిలో, టీమ్ ఇండియాకు ప్రతి బ్యాట్స్‌మెన్ సహకారం అవసరం. ఇందులో, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ , శివమ్ దూబే వంటి బ్యాట్స్‌మెన్ ముందుగానే ఔట్ కావడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ పరిస్థితిలో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా జట్టుకు అవసరం కాగా అతను కూడా విఫలమయ్యాడు.
జడేజా మళ్లీ ఫెయిలయ్యాడు. గత 15 ఏళ్ల నుంచి అదే పరిస్థితి
15వ ఓవర్లో 96 పరుగుల స్కోరు వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోవడంతో రవీంద్ర జడేజా అడుగుపెట్టాడు. భారత ఇన్నింగ్స్‌లో మరో 35 బంతులు మిగిలి ఉన్నాయి,.వాటిని సద్వినియోగం చేసుకుంటే జట్టు స్కోరు మరింత పెరిగి ఉండేది. ఇక్కడ జడేజా తన సత్తా చాటాల్సి ఉన్నా తొలి బంతికే ఔట్ కావడం విస్మయానికి గురి చేసింది. ఇలా టీ20 ప్రపంచకప్‌లో అవసరమైన సమయంలో జడేజా తన బ్యాటింగ్‌తో మరోసారి నిరాశపరిచాడు.
బ్యాటింగ్ లో ఇలా విఫలమవడం జడేజాకు కొత్తేమీ కాదు. గతంలోనూ విఫలమయ్యాడు. జడేజా 2009 నుంచి టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియాలో ఆడుతున్నాడు. 2022 ప్రపంచకప్ మినహా ప్రతిసారీ జట్టులో ఉంటున్నాడు. బ్యాటింగ్ చేసే అవకాశం ఎప్పుడూ రాలేదు కానీ అవకాశం వచ్చినప్పుడు కూడా అతని సహకారం పెద్దగా లేదు. జడేజా టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్ ఆడాడు, అయితే అతను 99 బంతులు ఆడినా 95 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అంటే సగటు 13.57 . స్ట్రైక్ రేట్ 95.95 మాత్రమే, ఇందులో 6 ఫోర్లు 1 సిక్స్ మాత్రమే ఉన్నాయి.
బౌలింగ్‌లో అద్భుతం, బ్యాటింగ్‌లో విఫలం
సహజంగానే, జడేజా ప్రధాన పాత్ర స్పిన్ బౌలింగ్. దీనిలో అతను ప్రపంచ కప్ చరిత్రలో ఇండియా అత్యంత విజయవంతమైన బౌలర్లలో జడేజా ఒకరు. 21 వికెట్లు తీశాడు. అయితే బ్యాటింగ్‌లో కూడా అతనిపైనా అంచనాలు ఉన్నాయి. కొన్నేళ్లుగా, ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో అతని బ్యాటింగ్ మెరుస్తున్న తీరు చూస్తుంటే, అతనిపై అంచనాలు మరింత పెరిగాయి. తుది జట్టులో చోటు సంపాదించడానికి ఇదే కారణం. కానీ అలాంటి ప్రదర్శన మాత్రం ఆశా జనకంగా లేకపోవడడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.