T20 ICC Prize Money: ఐసీసీ T20 ప్రపంచ కప్ 2024 ముగిసింది. ఈసారి టీ20 ప్రపంచకప్ జూన్ 2 నుంచి 29 వరకు వెస్టిండీస్ , అమెరికాలలోజరిగింది. కెన్సింగ్టన్ ఓవల్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఏడు పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు భారీగా నజరానా దక్కింది. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు కూడా భారీగా నజరానా అందుకుంది. ఈ మెగా ఈవెంట్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇప్పటికే ప్రైజ్ మనీని ప్రకటించింది. T20 ప్రపంచ కప్ 2024 కోసం మొత్తం $11.25 మిలియన్లు (సుమారు రూ. 93.51 కోట్లు) ప్రైజ్ మనీగా నిర్ణయించింది.
టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచిన భారత జట్టు సుమారు రూ. 20.36 కోట్లు ($2.45 మిలియన్లు) అందుకుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి విజేత జట్టుకు భారీ మొత్తం లభించింది. కాగా, ఫైనల్‌లో ఓడిన దక్షిణాఫ్రికా(రన్నరప్)కు సుమారు రూ. 10.64 కోట్లు ($1.28 మిలియన్లు) అందుకుంది. సెమీ-ఫైనల్‌కు చేరుకున్న ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్‌లకు దాదాపు రూ. 6.54 కోట్లు ($787,500) అందించారు. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో 20 జట్లు పాల్గొన్నాయి. ప్రతి జట్టుకు ఐసీసీ కొంత మొత్తాన్ని ఇచ్చింది. సూపర్-8 (రెండో రౌండ్) దాటి ముందుకు సాగని జట్లకు ఒక్కొక్కటి $382,500 (సుమారు రూ. 3.17 కోట్లు) అందుకుంది.
తొమ్మిది నుంచి 12వ స్థానంలో నిలిచిన జట్లకు ఒక్కొక్కటి $247,500 (దాదాపు రూ. 2.05 కోట్లు) లభించాయి. కాగా, 13 నుంచి 20వ ర్యాంక్‌లో ఉన్న జట్లు ఒక్కొక్కటి $225,000 (సుమారు రూ. 1.87 కోట్లు) అందుకున్నాయి. ఇది కాకుండా, మ్యాచ్‌లో (సెమీ-ఫైనల్స్, ఫైనల్స్ మినహా) గెలిచిన జట్లకు అదనంగా $31,154 (సుమారు రూ. 25.89 లక్షలు) లభించాయి.
టీ20 ప్రపంచ కప్ 2024 ప్రైజ్ మనీ
విజేత (భారతదేశం): రూ. 20.36 కోట్లు
రన్నరప్ (దక్షిణాఫ్రికా): రూ. 10.64 కోట్లు
సెమీ-ఫైనలిస్టులు: రూ. 6.54 కోట్లు
2వ రౌండ్ నిష్క్రమణ: రూ. 3.17 కోట్లు
9వ నుంచి 12వ ర్యాంక్ పొందిన జట్టు: రూ. 2.05 కోట్లు
13వ నుండి 20వ ర్యాంక్ పొందిన జట్టు: 1.87 కోట్లు
మొదటి, రెండో రౌండ్ విజయాలు: రూ. 25.89 లక్షలు
ఈసారి టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు 9 మైదానాల్లో జరిగాయి. ఇందులో 6 వెస్టిండీస్‌లో, మూడు అమెరికాలో జరిగాయి. వెస్టిండీస్‌లో ఆంటిగ్వా, బార్బడోస్, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్‌తో పాటు ట్రినిడాడ్‌లో మ్యాచ్‌లు జరిగాయి. అమెరికాలోని ఫ్లోరిడా, న్యూయార్క్ , టెక్సాస్‌లలో మ్యాచ్‌లు నిర్వహించారు.
ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొనగా, నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్ నుంచి టాప్-2 జట్లు ముందుకొచ్చాయి. భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, అమెరికా, ఆస్ట్రేలియాలు సూపర్-8 స్థానాల్లో నిలిచాయి. ఆపై సూపర్-8 నుంచి నాలుగు జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. 2024 టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 55 మ్యాచ్‌లు జరిగాయి. గ్రూప్ దశలో 40 మ్యాచ్‌లు జరగ్గా, సూపర్-8 రౌండ్‌లో 12 మ్యాచ్‌లు జరిగాయి. ఆ తర్వాత రెండు సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి.