మంచిర్యాల మాతా శిశు సంరక్షణ కేంద్రం నుంచి గర్భిణులు, బాలింతల తరలింపు
నీట మునిగిన పంట పొలాలు
ఎల్లంపల్లికి పొటెత్తుతున్న వరద
Heavy floods: వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్గాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకి కడెం ప్రాజెక్టు నుంచి వదిలిన నీటి తో పాటు వరద నీరు వచ్చి చేరుతుండటంతో నిండుకుండలా మారింది. ఎల్లంపల్లి అధికారులు 30 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దీంతో గోదావరి నిండుగా ప్రవహిస్తుంది. ఇటు రాల్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తూ గోదావరిలో కలుస్తుండడంతో గోదావరి వరద ప్రవాహం మరింత పెరుగోతోంది. ప్రస్తుతం మంచిర్యాల సమీప గోదావరి పుష్కర ఘాట్, స్నాన ఘట్టాలు దాటి ప్రవహిస్తుంది.
పొంచి ఉన్న ముప్పు
గోదావరి నదికి వంద మీటర్ల దూరంలోనే మాత శిశు సంరక్షణ కేంద్రం నిర్మించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో 30 గేట్లు ఎత్తిన ఎల్లంపల్లి అధికారులు మరో ఐదు గట్లు ఎత్తితే ఎంసీహెచ్ చుట్టూ వరద నీరు చేరనుంది. గతంలో సైతం ఎంసీహెచ్ నిర్మాణ సమయంలో, ఆసుపత్రి ప్రారంభించిన సమయంలో జలదిగ్బంధమైన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఆస్పత్రిలో సుమారు 100 మందికి పైనే గర్భిణీలు, బాలింతలు ఇబ్బందులు పడ్డ దళకాలు లేకపోలేదు. ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్య సేవలు మొదలయ్యాయి అనుకునేలోపే మరో మరు ఆసుపత్రిని అధికారులు లోని గర్భిణీ బాలింతలను తరలిస్తున్న వైన్యం.
సుమారు యాభై నుంచి వందకి మంది పైగా బాలింతలు, మరో వంద మందికి పైగా కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. వర్షం ఇలాగే కొనసాగితే వర్షం నీరు చు ట్టూరా చేరే అవకాశం లేకపోలేదు. మరో వైపు విషసర్పాలు, క్రిమికీటకాలు బారిన పడే అవకాశం ఎక్కువ ఉంది.
నష్టంలో రైతన్నలు
మంచిర్యాల జిల్లా లో కూరుస్తున్న భారీ వర్షాలకు రైతులను తీవ్ర నష్టం వట్టిలనుంది. జిల్లా లోని హాజిపూర్, మంచిర్యాల మండలం లోని వరి, పత్తి చేనుల్లనో చేరిన వరద
శెనార్తి మీడియా, మంచిర్యాల :